ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Homemade Washing Machine: వాషింగ్ మెషీన్ కొనడానికి డబ్బుల్లేక.. ఓ డ్రమ్ముతో ఎలా తయారు చేశాడో చూస్తే..!

ABN, First Publish Date - 2023-11-20T22:05:23+05:30

ఓ నీళ్ల డ్రమ్ము, ఎలక్ట్రిక్ మోటార్‌తో తయారు చేసిన వాషింగ్ మెషీన్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఇంటర్నెట్ డెస్క్: అవసరమే ఆవిష్కరణలకు జీవం పోస్తుందనేది పాశ్చాత్య సామెత. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న ఓ వీడియో చూసి జనాలు సరిగ్గా ఇదే కామెంట్ చేస్తున్నారు. వాషింగ్ మెషీన్ కొనుక్కునేందుకు డబ్బుల్లేకపోవడంతో ఓ వ్యక్తి సొంతంగా వాషింగ్ మెషీన్(Home made Washing machine) డిజైన్ చేసిన తీరు నెట్టింట్లో వైరల్‌గా(Viral Video) మారింది. ఇంట్లో నిత్యం కనిపించే వస్తువులతో అతడు చేసి అద్భుతం చూసి జనాలు షాకైపోతున్నారు.

Ind Vs Aus: ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తే ఇంతే.. ఫైనల్స్‌లో టీమిండియా బ్యాటింగ్‌పై నోరుపారేసుకున్న షాహిద్ అఫ్రీదీ!

Viral: నేను వరల్డ్ కప్ మ్యాచ్ చూడను.. ఆనంద్ మహింద్రా సంచలన ప్రకటన..కారణం తెలిస్తే..


వీడియోలోని వ్యక్తి ఏకంగా డ్రమ్ము, మోటార్ సాయంతో వాషింగ్ మెషీన్ తయారుచేసి చూపించాడు. ఓ పెద్ద డ్రమ్ముకు చిల్లులు పెట్టి, వాటితో డ్రమ్మును మోటార్‌కు కనెక్ట్ చేశాడు. డ్రమ్ములోపల వేసిన బట్టలను తిప్పేందుకు వీలుగా ఓ చక్రాన్ని కూడా ఏర్పాటు చేశాడు. డ్రమ్ములో నీళ్లు పోసి, వాషింగ్ పౌడర్, దుస్తులు వేసి మోటార్ ఆన్ చేశాడు. అంతే..ఈ హోం మేడ్ వాషింగ్ మెషీన్ చకచకా పని ప్రారంభించేసింది. పేరుకు అది ప్లాస్టిక్ డ్రమ్మే అయినప్పటికీ ఎక్కడా నీళ్లు లీకు కాకుండా అతడు దానికి మోటార్ అనుసంధానం చేసిన విధానం జనాలను ఆశ్చర్యపోయేలా చేస్తోంది(Washing machine made from drum and motor).

Dangerous animals: ఇవే మనుషుల ప్రాణాలను తీసేస్తున్నాయ్.. ఆ ఒక్కదాని వల్ల ఏడాదికి 7 లక్షల మందికి పైనే..


ఇక ఈ వీడియో నెట్టింట ఎంతగా వైరల్ అవుతోందో మాటల్లో వర్ణించడం అసాధ్యం. వీడియోలోని వ్యక్తి ఐడియాకు జనాలు ఫిదా అయిపోయారు. ఇప్పటికే ఈ వీడియోకు రెండు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇది 150+ లీటర్ల వాషింగ్ మెషీన్ అని కొందరు కామెంట్ చేశారు. మరికొందరు మాత్రం దీన్ని వాడితే కరెంట్ బిల్లు పదివేలు దాటిపోతుందని హెచ్చరించారు. ఇందులో దుప్పట్లు బాగా ఉతకొచ్చని మరికొందరు అభిప్రాయపడ్డారు. భారతీయులకు టాలెంట్ తక్కువేం లేదంటూ అధిగశాతం మంది అభిప్రాయపడ్డారు. ఇలా రకరకాల అభిప్రాయాల మధ్య వీడియో వైరల్‌గా మారింది.

Updated Date - 2023-11-20T22:05:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising