ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Vaigai Express: 46వ వసంతంలోకి వైగై ఎక్స్‌ప్రెస్‌

ABN, First Publish Date - 2023-08-16T08:55:08+05:30

దేశ 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని మంగళవారం దేశ ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో, రాష్ట్రంలోని దక్షిణ జిల్లాల

పెరంబూర్‌(చెన్నై): దేశ 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని మంగళవారం దేశ ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో, రాష్ట్రంలోని దక్షిణ జిల్లాల అభివృద్ధికి ఆధారంగా ఉన్న వైగై ఎక్స్‌ప్రెస్‌ రైలు(Vaigai Express Train) 46వ జన్మదినం వేడుకలు కూడా స్వాతంత్య్ర దినోత్సవాలతో పాటు జరుపుకున్నారు. 1977 ఆగస్టు 15న ప్రారంభమైన వైగై ఎక్స్‌ప్రెస్‌ చెన్నై-మదురై(Chennai-Madurai) మధ్య పగటి పూట నడుస్తుండడంతో వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంది. ఈ రైలు ప్రారంభించిన తొలి సంవత్సరంలోనే మీటర్‌ గేజ్‌ రైలు మార్గంలో 105 కి.మీ వేగంతో వెళ్లిన ఆసియాలోనే తొలి రైలుగా పేరుగాంచింది. అలాగే, మీటర్‌ గేజ్‌ మార్గంలో తొలిసారిగా ఏసీ వసతితో కూడిన రైలుగా వైగై సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ నిలిచింది. మదురై నుంచి ఉదయం 7.10 గంటలకు బయల్దేరే ఈ రైలు మధ్యాహ్నం 2.35 గంటలకు చెన్నై చేరుకుంటుంది. మరోమార్గంలో చెన్నై నుంచి మధ్యాహ్నం 1.40 గంటలకు బయల్దేరి రాత్రి 9.15 గంటలకు మదురై చేరుకుంటుంది. ఈ రైలు ప్రారంభించి 46వ వసంతంలోకి అడుగిడిన సందర్భంగా, రైలింజన్‌కు దీపారాధనలు, ప్రత్యేక పూజలు నిర్వహించి, అరటి తోరణాలు, రైలు పెట్టెలను రంగుల కాగితాలతో అలంకరించారు. అనంతరం రైల్వే అధికారుల సమక్షంలో ప్రయాణికులు కేక్‌ కట్‌ చేసి అందరికి పంచారు.

Updated Date - 2023-08-16T08:55:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising