ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Trivikram For PSPK: మిత్రుడి కోసం మరోసారి పెన్ను సాయం!

ABN, First Publish Date - 2023-02-21T14:54:05+05:30

పవన్‌కల్యాణ్‌కు సంబంధించిన ప్రతి సినిమా విషయంలోనూ త్రివిక్రమ్‌ జోక్యం ఎంతోకొంత ఉంటుంది. ఆయన దర్శకుడు అయ్యాక రచయితగా వేరే చిత్రాలకు పని చేయలేదు కానీ పవన్‌ కల్యాణ్‌ కోసం మాత్రం ఆయన పెట్టుకున్న రూల్‌ బ్రేక్‌ చేస్తుంటారు. ‘తీన్‌మార్‌’ సినిమాకు స్ర్కీన్‌ప్లే అందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పవన్‌కల్యాణ్‌కు (Pawan kalyan) సంబంధించిన ప్రతి సినిమా విషయంలోనూ త్రివిక్రమ్‌ (Trivikram) జోక్యం ఎంతోకొంత ఉంటుంది. ఆయన దర్శకుడు అయ్యాక రచయితగా వేరే చిత్రాలకు పని చేయలేదు కానీ పవన్‌ కల్యాణ్‌ కోసం మాత్రం ఆయన పెట్టుకున్న రూల్‌ బ్రేక్‌ చేస్తుంటారు. ‘తీన్‌మార్‌’ సినిమాకు స్ర్కీన్‌ప్లే అందించారు. భీమ్లానాయక్‌ విషయంలోనూ ఆయన ఎంతో చొరవ తీసుకున్నారు. ఇప్పుడు మరోసారి పవన్‌ కల్యాణ్‌ కోసం త్రివిక్రమ్‌ పని చేయనున్నారు. (Trivikram For Pawan kalyan)

నటుడు, దర్శకుడు సముద్రఖని దర్శకత్వంలో పవన్‌ కల్యాణ్‌ హీరోగా ఓ సినిమా చేయనున్నారు. ‘వినోదయ సీతమ్‌’కి రీమేక్‌ ఇది. ఈ చిత్రానికి రచయితగా సాయిమాధవ్‌ బుర్రాను ఎంచుకున్నారు. అయితే ఈ సినిమాకు స్ర్కీన్‌ప్లే మాత్రం త్రివిక్రమ్‌దే. ఈ రీమేక్‌ స్టోరీని పవన్‌ శైలికి అనుగుణంగా కొన్ని కీలకమైన మార్పులు చేశారట త్రివిక్రమ్‌. ఈ సినిమాకు మాటలు కూడా రాస్తున్నాడట. తనకున్న బిజీ షెడ్యూల్‌ వల్ల బుర్రా సాయిమాధవ్‌ (Sai madhav burra) ఈ సినిమా నుంచి తప్పుకొన్నట్లు సమాచారం. దాంతో ఆ బాధ్యతని కూడా త్రివిక్రమ్‌ తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం మహేష్‌ బాబు సినిమా పనుల్లో త్రివిక్రమ్‌ బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఈ రీమేక్‌ బాధ్యతలు కూడా తీసుకున్నారు. సాయిమాధవ్‌ స్థానంలో మరో రచయిను అనుకున్నప్పటికీ త్రివిక్రమ్‌ రాస్తేనే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేయడంతో తివిక్రమ్‌కి తప్పలేదు. అయితే అటు పవన్‌కల్యాణ్‌.. ఇటు ఎస్‌ఎస్‌ఎంబీ 28 చిత్రాలను గురుజీ ఎలా బ్యాలెన్స్‌ చేస్తారో చూడాలి!

Updated Date - 2023-02-21T14:56:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising