ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Temple: ఆ గుడిలో అరుదైన ఘటన.. 35 మంది ఉద్యోగులు.. 11 రోజులుగా కట్టలకొద్దీ డబ్బును లెక్కిస్తూనే ఉన్నారు..!

ABN, First Publish Date - 2023-06-20T16:01:47+05:30

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో ఉన్న ఖజ్రానా గణపతి ఆలయం ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలోని గణపతి చాలా పవర్ ఫుల్ అని చాలా మంది నమ్ముతారు. ఆ ఆలయానికి ప్రతియేటా భారీగా విరాళాలు అందుతాయి. ఆలయంలో ఉన్న హుండీల్లో భక్తులు తమ కానుకలను సమర్పిస్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని ఇండోర్ (Indore) జిల్లాలో ఉన్న ఖజ్రానా గణపతి ఆలయం (Khajrana Ganesh temple) చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలోని గణపతి చాలా పవర్ ఫుల్ అని చాలా మంది నమ్ముతారు. ఆ ఆలయానికి ప్రతియేటా భారీగా విరాళాలు అందుతాయి. ఆలయంలో ఉన్న హుండీల్లో భక్తులు తమ కానుకలను సమర్పిస్తారు. ప్రస్తుతం ఈ ఏడాది వచ్చిన విరాళాలను (Donation) 35 మంది ఉద్యోగులు 11 రోజులుగా లెక్కిస్తున్నారు. మరో రెండు రోజుల పాటు ఈ లెక్కింపు కొనసాగుతుందని భావిస్తున్నారు.

ఇప్పటివరకు జరిగిన లెక్కింపు ప్రకారం గణేష్ ఆలయానికి రూ.1 కోటి 81 లక్షల విరాళాలు అందాయి. ఈ ఏడాది జనవరిలో ఇండోర్ జిల్లాలో ప్రవాసీ భారతీయ సమ్మేళన్, గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ నిర్వహించబడ్డాయి. దీంతో విదేశీ భక్తులు కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చి కానుకలు సమర్పించారు. హుండీల్లో విదేశీ కరెన్సీ, బంగారం, వెండి ఆభరణాలు కూడా ఉన్నట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. అలాగే కొందరు భక్తులు తమ కోరికలను పేపర్లపై రాసి హుండీల్లో కూడా వేస్తుంటారు. అలాంటి పేపర్లు కూడా చాలా ఉన్నాయి.

Viral: ఈ కుర్రాడిని ఇలా కట్టేయడం వెనుక పెద్ద కథే ఉంది.. అయ్యో పాపం.. అని జాలి పడుతున్నారేమో.. ఇతగాడి నిర్వాకమేంటో తెలిస్తే..!

గతేడాది డిసెంబర్‌లో హుండీల లెక్కింపు జరగా రూ.1 కోటి 30 లక్షల విరాళం అందినట్టు తేలింది. ఈ ఆరేడు నెలల్లో ఏకంగా రూ.1.81 కోట్లు విరాళంగా రావడం రికార్డు అని చెబుతున్నారు. కాగా, గత 11 రోజులుగా హుండీల్లో సొమ్మును లెక్కించే పని కొనసాగుతోంది. మరో రెండు రోజుల పాటు నోట్లు, చిల్లర్ల లెక్కింపు కొనసాగనుంది. మొత్తం విరాళాల సంఖ్య దాదాపు 1 కోటి 85 లక్షలకు చేరుకోవచ్చని అంచనా. ఈ లెక్కింపు కార్యక్రమంలో 20 మంది ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందినవారు కాగా, 15 మంది ఉద్యోగులు ఆలయ పరిపాలనకు చెందినవారు.

Updated Date - 2023-06-20T16:01:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising