ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Thalapathy67: సినిమా మొదలెట్టకముందే 246 కోట్లు లాభం

ABN, First Publish Date - 2023-02-24T12:47:24+05:30

ఇప్పటికే ఈ సినిమాకి చాలా హైప్, క్రేజ్ కూడా వచ్చింది. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలయి కొన్ని రోజులు కూడా కాకముందే, ఈ సినిమా సాటిలైట్, ఓ.టి.టి హక్కులు అమ్ముడుపోయాయట. ఎంతకి అమ్ముడు పోయాయో తెలిస్తే షాక్ అవుతారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తమిళ సూపర్ స్టార్ విజయ్ (#Vijay67) తన 67వ సినిమా సెన్సేషనల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ (#LokeshKanagaraj) తో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా మొదలెట్టి, చాలా వేగంగా చేస్తున్నారు. 'లియో' అని పేరు కూడా (#Thalapathy67) పెట్టిన ఈ సినిమాలో చాలా పెద్ద స్టార్ కాస్ట్ ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజుల కిందట కాశ్మీర్ లో మొదలెట్టారు. దర్శకుడు లోకేష్ కానగరాజ్ ఇంతకు ముందు కమల్ హాసన్ (#KamalHaasan) తో 'విక్రమ్' (#Vikram) సినిమా తీసి భారత దేశం లో అగ్రగణ్య దర్శకుల్లో ఒకడు అయిపోయాడు అంటే ఆ సినిమా అంత విజయం సాధించింది అని తెలుస్తోంది. ఇప్పుడు రాబోయే 'లియో' (#Leo) అనే ఈ సినిమా కూడా అంతకంటే పెద్దగా వస్తోంది అనటం లో సందేహం లేదు.

ఎందుకంటే ఈ సినిమాలో కథానాయకురాలు త్రిష (#Trisha) అయితే, విలన్ గా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ (#SanjayDutt) నటిస్తున్నాడు. ఇంకా ఈ సినిమాలో మిస్కిన్, ప్రియా ఆనంద్ (#PriyaAnand), గౌతమ్ వాసుదేవ్ మీనన్ (#GautamVasudevMenon), శాండీ మాస్టర్ లాంటి పేరున్న వాళ్ళు అందరూ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి చాలా హైప్, క్రేజ్ కూడా వచ్చింది. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలయి కొన్ని రోజులు కూడా కాకముందే, ఈ సినిమా సాటిలైట్, ఓ.టి.టి హక్కులు అమ్ముడుపోయాయట. ఎంతకి అమ్ముడు పోయాయో తెలిస్తే షాక్ అవుతారు. ఈ సినిమా 246 (246 crore for OTT rights)) కోట్లకి సాటిలైట్, ఓ.టి.టి కి అమ్ముడు పోయిందని, తమిళనాడు చిత్ర పరిశ్రమలో ఇదొక రికార్డు అని కూడా అంటున్నారు.

సినిమా షూటింగ్ మొదలవకుండానే, ఇంత రేట్స్ కి పెద్ద స్టార్ సినిమాలు అమ్ముడవుతూ ఉంటే, ఆ సినిమా నిర్మాతకి మరి లాభాలు ఎందుకు వుండవు. అదీ కాకుండా చాల ఓ.టి.టి ప్లాట్ ఫార్మ్ లు ఇప్పుడు దక్షిణ భారత దేశ చలన చిత్రాల మీదే కన్ను వేసిందని, అందుకని సౌత్ సినిమాలకి బాగా డిమాండ్ ఉందని తెలుస్తోంది. ఆ విధంగానే విజయ్ సినిమా 246 కోట్లకు అమ్ముడు పోయిందని తమిళ్ చిత్ర పరిశ్రమలో టాక్ నడుస్తోంది.

Updated Date - 2023-02-24T12:47:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising