Viral: ఈ కుర్రాడు స్విగ్గీకే ఝలక్ ఇద్దామనుకున్నాడు.. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించి ఉండడు!
ABN, Publish Date - Dec 29 , 2023 | 07:37 PM
స్వి్గ్గీకే పంచ్ ఇద్దామనుకున్న యువకుడి పరిస్థితి తలకిందులు.. నెట్టింట వైరల్‌గా మారిన వీడియో!
ఇంటర్నెట్ డెస్క్: మీకేమైనా తీరని కోరికలు ఉంటే చెప్పండి తీర్చేద్దామంటూ ఇటీవల స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ (Swiggy Instamart) సోషల్ మీడియా వేదికగా ఓ ఆఫర్ తీసుకొచ్చింది. ఎంపిక చేసిన కస్టమర్లకు వారు ఆశించినవి డెలివరీ చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పింది. అంటే.. ఎప్పటి నుంచో తినాలనుకున్నది, లేదా కొనుక్కోవాలనుకున్నది ఏదైనా ఉంటే చెప్పండని దానర్థం! కానీ ఓ కుర్రాడు స్విగ్గీకే టెస్ట్ పెట్టాడు.
స్విగ్గీ ప్రశ్నకు నెటజన్లు తమకు తోచినవి చెబుతుంటే హిమాన్షూ బన్సల్ అనే యువకుడు మాత్రం తనదైన ట్విస్ట్ ఇచ్చాడు. తనకు హాట్‌గా మారాలని ఎంతగానో అనిపిస్తోందంటూ రిప్లై ఇచ్చాడు (Customer wants to be hot). దీనికి స్విగ్గీ కూడా అదే రేంజ్‌లో స్పందించింది.
IPhone: ఐఫోన్ కల సాకారం చేసుకునేందుకు ఇదే కరెక్ట్ టైం! త్వరపడండి..
ఇటీవల ఓ రోజు అతడి ఇంటికి స్విగ్గీ డెలివరీ బాయ్ వచ్చాడు. ఎప్పటిలాగే గేట్ వద్దకు వచ్చి ఆగాడు. ఈ క్రమంలో హిమాన్షూ గేటు తీసి తొంగి చూసి దిమ్మెరపోయాడు. తన ఎదురుగా స్విగ్గీ డెలివరీ బాయ్‌తో పాటూ ఓ బ్యాండ్‌మేళాం కూడా రావడంతో అతడికి క్షణకాలం పాటు ఏం జరుగుతోందో అర్థంకాలేదు. హిమాన్షూను చూడగానే వారు బ్యాండ్ వాయించడం ప్రారంభించారు. ఈలోపు, డెలివరీ ఏజెంట్ హిమాన్షూ మెడలో ఓ దండ వెసి హీటర్‌ను అతడు చేతిలో పెట్టాడు. అప్పటికి విషయం అర్థమవడంతో హిమాన్షూ కూడా నవ్వుకున్నాడు. డెలివరీ ఏజెంట్‌తో కలిసి ఫొటోలకు పోజులిచ్చాడు.
Viral: రిస్క్ అని తెలిసీ ఆనంద్ మహీంద్రాను పబ్లిక్‌గా రూ. లక్ష అప్పు అడిగాడు.. ఆ తరువాత..
నెట్టింట ఈ వీడియో వైరల్ (Viral Video) కావడంతో నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. స్విగ్గీతో జోకులేస్తే ఇలాంటి సర్‌ప్రైజులే ఉంటాయంటూ సెటైర్లు పేలుస్తున్నారు. ఏదైనా ఆర్డర్ చేసే అవకాశం ఉన్నప్పటికీ చివరకు ఇలాంటి గిఫ్ట్ తీసుకున్నాడు. మంచి అవకాశాన్ని జారవిడుచుకున్నాడంటూ కొందరు కామెంట్ చేశారు. ఇక స్విగ్గీ వాళ్ల డెలివరీ స్టైల్‌కు యువకుడు షాకైన తీరు నెటిజన్లకు మరింతగా నచ్చింది. దీనిపై నెట్టింట కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
Shocking: చెవిలో ఒకటే నొప్పి.. డౌటొచ్చిన మహిళ కెమెరా డివైజ్ పెట్టి చూసుకుంటే.. దారుణం..
Viral: ఇలాంటోళ్లను ఏమనాలి! రైల్లో అందరూ చూస్తున్నారన్న సోయ కూడా లేకుండా ఏంచేశాడో మీరే చూడండి!
Extra Income: సైడ్ సంపాదన కావాలా? కొత్త సంవత్సరంలో ఇలా చేయండి..!
Updated Date - Dec 29 , 2023 | 07:56 PM