ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Success Story: 'కళ్ళు లేనివాడివి ఏం చేయగలవు? పాటలు పాడి అడుక్కో' అని అందరూ అన్నారు.. కానీ ఇప్పుడు అతను ఎలా ఉన్నాడంటే..

ABN, First Publish Date - 2023-03-28T15:51:09+05:30

కళ్ళు లేని వాడు ఇక ఏం చేయగలుగుతాడని చుట్టుప్రక్కల వారు ఎగతాళి చేశారు. పాటలు పాడి అడుక్కుని బ్రతకమని సలహా ఇచ్చారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

వైకల్యం మనిషి ప్రతిభను, అభివృద్దిని ఆపలేదు అని చెబుతుంటారు. వైకల్య సమస్యలు ఉన్నా అద్భుత విజయాలు సాధించినవారున్నారు. ఈయనా అలాంటి కోవకు చెందినవారే.. పుట్టుకతోనే రెండు కళ్ళు లేవు, కళ్ళు లేని వాడు ఇక ఏం చేయగలుగుతాడు అని చుట్టుప్రక్కల వారు ఎగతాళి చేసేవారు. పాటలు పాడటం నేర్చుకుంటే కనీసం అడుక్కుని కడుపునింపుకోవచ్చని సలహా ఇచ్చారు. కానీ ఆయన నా స్థానం అది కాదని ఆనాడే అనుకున్నారు. తన విజయంతోనే అడుక్కోమని సలహా ఇచ్చిన వారి నోళ్ళు మూయించాడు. తనకు అవసరమైన రెండు రూపాయలు ఆయన జీవితాన్ని మార్చేశాయి. అందరికీ స్పూర్తిని రగిలించే ఈయన సక్సెస్ స్టోరీ తెలుసుకుంటే..

ఛత్తీస్ గడ్(Chhattisgarh) రాష్ట్రం సూరజ్ పూర్(Surajpur) జిల్లాలో బుద్ లాల్ అనే వ్యక్తి ఉన్నాడు. ఈయన పుట్టుకతోనే అంధుడు(Blind person by birth). తండ్రి చిన్నతనంలోనే చనిపోవడంతో బుద్ లాల్ జీవితం అయోమయంలో పడిపోయింది. చుట్టుపక్కల వారందరూ బుద్ లాల్ తో 'పాటలు పాడటం నేర్చుకో.. రైళ్ళలో కళ్ళు లేని వాళ్ళు ఎంతోమంది పాటలు పాడి పొట్టనింపుకుంటారు. అది తప్ప వేరే మార్గం లేదు నీకు' అని సలహా ఇచ్చారు. కానీ బుద్ లాల్ వారి మాటలు పట్టించుకోలేదు.కష్టపడి చదివి గొప్పగా ఎదగాలని అనుకున్నాడు. అతను 2007 సంవత్సరంలో 10వతరగతి చదువుతున్నప్పుడు ఒక సంఘటన జరిగింది. స్కూల్ బయట సమోసా అమ్ముతుంటే అతనికి సమోసాలు తినాలని అనిపించింది. ఒక సమోసా 2రూపాయలు. కానీ 2రూపాయలు కూడా బుద్ లాల్ చేతిలో లేవు. అప్పుడే అతనికి అర్థమైంది. 'గొప్పగా ఎదగాలన్నా, పై చదువులు చదువుకోవాలన్నా డబ్బులు అవసరమవుతాయి, 2రూపాయలు కూడా చేతిలో లేని నేను పై చదువులు చదవాలని ఆశ పడితే సరిపోదు, డబ్బు సంపాదిస్తూ చదువుకుంటేనే పైకి ఎదగగలను' అని అనుకున్నాడు. అప్పటినుండి అహర్నిశలు శ్రమించి ఒకవైపు డబ్బు సంపాదిస్తూ మరొవైపు చదువులో ముందడుగు వేశాడు. అతని కష్టం వృధా పోలేదు. ఛత్తీస్ గఢ్ రాష్ట్రం సూరజ్ పూర్ జిల్లాలో రేవతి నారాయణ్ మిశ్రా కళాశాల(Revathi Narayan Mishra College) అసిస్టెంట్ ప్రొఫెసర్(Assistant professor) గా విధులు నిర్వర్తిస్తున్నాడు.

ఏమీ చేయలేవు, అడుక్కోవడానికి మించి వేరే మార్గం లేదు నీకు అని ఎగతాళిగా మాట్లాడిన వారు బుద్ లాల్ ఎదిగిన విధానం చూసి సంభ్రమంలోకి జారిపోయారు. చూపు లేకపోతేనేం ఏదైనా సాధించాలనే సంకల్పబలం ఉంటే చాలని బుద్ లాల్ నిరూపించాడు. ఈయన్ను అర్థం చేసుకునే అమ్మాయిని పెళ్ళిచేసుకున్నాడు. వీరికి పిల్లలు కూడా ఉన్నారు. బుద్ లాల్ గురించి విన్నవారు ఎంతోమందికి ఇతను స్పూర్తి అని అంటున్నారు.

Read also: Food Items Eating Time: తినే సమయమే చాలా ముఖ్యం.. అరటిపండ్ల నుంచి నాన్‌వెజ్ వరకు.. దేన్ని ఏ టైమ్‌లో తినకూడదో తెలుసా..?


Updated Date - 2023-03-28T16:22:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising