ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్కూల్లో చికెన్ లెగ్ పీసుల గోల.. టీచర్లను గదిలో పెట్టి తాళం వేసిన విద్యార్థులు..!

ABN, First Publish Date - 2023-02-21T19:41:46+05:30

పశ్చిమబెంగాల్‌లోని (West Bengal) ఓ స్కూల్‌లో చికెన్ లెగ్ పీస్‌ల కారణంగా టీచర్లు, స్టూడెంట్ల మధ్య గొడవ మొదలైంది. టీచర్లను విద్యార్థులు తరగతి గదిలో బంధించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాధారణంగా పాఠశాలలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మధ్య విద్య సంబంధమైన విషయాల గురించి వాగ్వాదాలు జరుగుతాయి. బాగా చదవని విద్యార్థులను ఉపాధ్యాయులు శిక్షిస్తుంటారు. అయితే పశ్చిమబెంగాల్‌లోని (West Bengal) ఓ స్కూల్‌లో చికెన్ లెగ్ పీస్‌ల కారణంగా టీచర్లు, స్టూడెంట్ల మధ్య గొడవ మొదలైంది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు స్కూల్‌లోని టీచర్లందరినీ ఓ గదిలో పెట్టి తాళం వేసేశారు. పోలీసులు వచ్చి విద్యార్థులను, వారి తల్లిదండ్రులను శాంతింపజేసి టీచర్లను విడుదల చేశారు. ఈ వార్త స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలోని అమృతి కాలనీ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల బృందం చేసిన పని విద్యార్థుల ఆగ్రహానికి కారణమైంది. బెంగాల్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజన మెనూలో చికెన్‌తో పాటు, పండ్లను కూడా అందిస్తోంది. అయితే అమృతి కాలనీ ప్రాథమిక పాఠశాల టీచర్లు ఆ చికెన్‌ మొత్తాన్ని విద్యార్థులకు ఇవ్వకుండా లెగ్ పీస్‌లను (Chicken Leg Pieces) తమ కోసం దాచుకున్నారు. దీంతో విద్యార్థులందరూ తమ తల్లిదండ్రులకు ఆ విషయం చెప్పారు.

అందమైన అమ్మాయి లిఫ్ట్ అడిగింది కదా అని బైక్ ఎక్కించుకున్నాడు.. కాస్త దూరం వెళ్లగానే చేసిన తప్పేంటో తెలిసొచ్చింది..!

గురువారం ఉదయం పిల్లల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకున్నారు. ఉపాధ్యాయులతో గొడవ పడ్డారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం తలెత్తింది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆరుగురు ఉపాధ్యాయులను తరగతి గదిలో నాలుగు గంటలకు పైగా బంధించారు (Students Lock Up Teachers). దీంతో టీచర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తల్లిదండ్రులకు నచ్చ చెప్పారు. దీంతో ఆ టీచర్లను విడిచిపెట్టారు.

Updated Date - 2023-02-21T19:41:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising