ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: ఇది పొరపాటు అట..ఈ పైలట్ విమానాన్ని ఎక్కడ దింపేశాడో చూడండి! ప్రయాణికులకైతే భారీ షాక్!

ABN, Publish Date - Dec 31 , 2023 | 05:56 PM

పైలట్ పొరపాటు కారణంగా ఓ విమానం గడ్డకట్టి ఉన్న నదిపై దిగింది. రష్యాలో ఈ ఘటన వెలుగు చూసింది.

ఇంటర్నెట్ డెస్క: విమానం రన్ వే దాటి కాస్తంత ముందుకెళ్లి ఆగిన ఘటనల గురించి విన్నాం. రన్ నుంచి పక్కకు వెళ్లిపోయిన ఘటనల గురించి కూడా చదివాం. కానీ ఓ విమానం తిన్నగా వెళ్లి నదిపై ల్యాండైందంటే మీరే మంటారు? వినడానికే ఆశ్చర్యంగా ఉన్న ఈ ఘటన ఇటీవల రష్యాలో జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా (Viral) మారాయి.

Photoshoot: స్టూడెంట్‌తో వివాదాస్పద ఫొటో షూట్‌..తమ బంధం ఎలాంటిదో చెప్పిన టీచర్!

స్థానిక మీడియా కథనాల ప్రకారం, పోలార్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం 30 మంది ప్యాసెంజర్లతో తూర్పు రష్యాలోని యాఖుట్స్క్ నగరం నుంచి బయలుదేరింది. షెడ్యూల్ ప్రకారం విమానం డిసెంబర్ 28న జైరియంకా విమానాశ్రయం, ఆ తరువాత శ్రెడ్నికోల్సిస్క్ ఎయిర్‌పోర్టుకు వెళ్లి తిరిగి వెనక్కు రావాలని. ఈ క్రమంలో జైరియంకా విమానాశ్రయం రన్‌వైపే దిగాల్సిన విమానం పక్కకు మళ్లి సమీపంలోని కోలిమా నదిపై దిగింది (Russian plane lands on Frozen river). అయితే, నది పూర్తిగా గడ్డకట్టుకుపోయి ఉండటంతో విమానం సురక్షితంగా ల్యాండైంది. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారు (Passengers safe).

Viral: ఈ దారుణాలు విమానాల్లో కూడా జరుగుతాయా? ప్యాసెంజర్‌కు షాకింగ్ అనుభవం


అయితే, పైలట్ పొరపాటు కారణంగా విమానం నదిపై ల్యాండ్ అయినట్టు తూర్పు సైబీరియా ట్రాన్స్‌పోర్టు ప్రాసిక్యూటర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఘటనపై ఫెడరల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్టు ఏజెన్సీ కూడా దర్యాప్తు ప్రారంభించింది. పైలట్ పొరపాటుకు గల కారణాలేంటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తోంది.

Viral: ముఖం కనబడకుండా నెత్తిపై చెంగు కప్పుకుని తిరుగుతున్న కోడలు.. అసలు విషయం తెలిసి అత్తింటి వారికి భారీ షాక్!

కాగా, ఇటీవల శాన్‌ఫ్రాన్‌సిస్కోలోని గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ సమీపంలో ఓ విమానం గగనతలంలో కదలకుండా ఆగిపోయినట్టు ఉన్న వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. అయితే, నిపుణులు దీనిపై క్లారిటీ ఇచ్చారు. విమానం వెనక, ముందు నుంచి వీచే గాలులు సమతీవ్రతలో ఉండటంతో విమానం వేగం బాగా నెమ్మదించిందని, ఫలితంగా వీడియోలో ఆగిపోయినట్టు కనిపించిందని చెప్పుకొచ్చారు.

Viral: వామ్మో.. గాడిద కోపం ఇంత భయంకరమా? ఇలాంటి సీన్ ఎప్పుడైనా చూశారా?

Viral: ఈ కుర్రాడు స్విగ్గీ‌కే ఝలక్ ఇద్దామనుకున్నాడు.. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించి ఉండడు!

Shocking: చెవిలో ఒకటే నొప్పి.. డౌటొచ్చిన మహిళ కెమెరా డివైజ్‌ పెట్టి చూసుకుంటే.. దారుణం..

Viral: ఇలాంటోళ్లను ఏమనాలి! రైల్లో అందరూ చూస్తున్నారన్న సోయ కూడా లేకుండా ఏంచేశాడో మీరే చూడండి!

Updated Date - Dec 31 , 2023 | 06:01 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising