ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

BigBoss: బిగ్ బాస్ ఇంట్లో రవి తేజ

ABN, First Publish Date - 2023-01-18T17:04:36+05:30

ఇదేంటి, బిగ్ బాస్ (Bigg Boss) లో రవితేజ (Ravi Teja) అని అనుకుంటున్నారా? ఇప్పుడు బిగ్ బాస్ లేదు కదా, మరి రవితేజ ఆ ఇంట్లోకి ఎలా వెళ్ళాడు అని ఆలోచిస్తున్నారా?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇదేంటి, బిగ్ బాస్ (Bigg Boss) లో రవితేజ (Ravi Teja) అని అనుకుంటున్నారా? ఇప్పుడు బిగ్ బాస్ లేదు కదా, మరి రవితేజ ఆ ఇంట్లోకి ఎలా వెళ్ళాడు అని ఆలోచిస్తున్నారా? అదేమీ కాదు. బిగ్ బాస్ ఇంట్లో రవితేజ సినిమా షూటింగ్ నడుస్తోంది. అన్నపూర్ణ ఏడెకరాల స్టూడియో లో బిగ్ బాస్ ఇల్లు పెర్మనెంట్ గా ఉంచేశారు. ప్రతి ఏడాది ఇంట్లో ఇంటీరియర్ మారుస్తూ వుంటారు అంతే. బిగ్ బాస్ లేనపుడు ఆ ఇల్లు సినిమా షూటింగ్ కి అద్దె కి ఇస్తూ వుంటారు. అందుకని అందులో రవి తేజ తన 'టైగర్ నాగేశ్వర రావు' (Tiger Nageswara Rao) సినిమా షూటింగ్ చేస్తున్నాడు అని తెలిసింది. ఈ సినిమాకి వంశీ కృష్ణ (Vamsi Krishna) దర్శకుడు కాగా, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan former wife Renu Desai) మాజీ భార్య రేణు దేశాయ్ ఇందులో ఒక ప్రముఖ పాత్ర పోషిస్తోంది.

ఈ సినిమా పాట ఒకటి ఈ బిగ్ బాస్ హౌస్ లో తీస్తున్నారు అని తెలిసింది. ఇది ఒక చిన్నహోటల్ లా మార్చి ఇందులో పాటను చిత్రీకరిస్తున్నట్టుగా తెలిసింది. రవి తేజ సరసన గాయత్రీ భరద్వాజ్ (Gayatri Bharadwaj), నుపుర్ సనన్ (Nupur Sanon) కథానాయికలుగా చేస్తున్నారు. ఇప్పుడు రవితేజ మంచి విజయాలతో వున్నాడు. అతని ముందు సినిమా 'ధమాకా' (Dhamaka) వందకోట్ల క్లబ్ లో మొదటి సారిగా చేరింది. తరువాత చిరంజీవి తో నటించిన 'వాల్తేరు వీరయ్య' (Waltair Veerayya) కూడా వందకోట్లను మూడు రోజుల్లోనే దాటేసింది. ఇప్పుడు అతను ఈ 'టైగర్ నాగేశ్వర రావు' సినిమా పూర్తి చెయ్యటం లో నిమగ్నమయి వున్నాడు, దీనితో పాటుగా సుధీర్ వర్మ (Sudheer Varma) దర్శకత్వం లో 'రావణాసుర' (Ravanasura) కూడా చేస్తున్నాడు. ఈరెండు సినిమాలు ఈ సంవత్సరం సమ్మర్ (Summer) లోపే విడుదల అయ్యే అవకాశాలు వున్నాయి అని తెలుస్తోంది.

Updated Date - 2023-01-18T17:04:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising