ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

PuriJagannadh: హీరోలు దొరకటం లేదు, మళ్ళీ రామ్ కోసం వెయిటింగ్

ABN, First Publish Date - 2023-03-01T14:43:23+05:30

దర్శకుడు పూరి జగన్నాధ్ (#PuriJagan) గురించి ఎక్కడా ఎటువంటి వార్తా లేదు. అంటే అతని తదుపరి సినిమా ఏమి చేస్తున్నాడు, ఎవరితో చేస్తున్నాడు, అసలు సినిమా పరిశ్రమలో టచ్ లో వున్నాడా లాంటి వార్తలు ఎక్కడా వినపడటం లేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

దర్శకుడు పూరి జగన్నాధ్ (#PuriJagan) గురించి ఎక్కడా ఎటువంటి వార్తా లేదు. అంటే అతని తదుపరి సినిమా ఏమి చేస్తున్నాడు, ఎవరితో చేస్తున్నాడు, అసలు సినిమా పరిశ్రమలో టచ్ లో వున్నాడా లాంటి వార్తలు ఎక్కడా వినపడటం లేదు. ఎందుకంటే అతని ఇంతకు ముందు విజయ్ దేవరుకొండ (#VijayDeverakonda) తో తీసిన పాన్ ఇండియన్ సినిమా 'లైగర్' (#Laigar) ప్లాప్ అవ్వటం, ఆ తరువాత ఆ సినిమా తీసుకున్న డిస్ట్రిబ్యూటర్స్ పూరి జగన్ ని కొంత డబ్బు తిరిగి ఇవ్వాలి అని అడగటం, అప్పట్లో ఇలాంటి వార్తలతో పూరి వైరల్ అయ్యాడు. కానీ అవన్నీ జరిగిన కొన్ని రోజుల తరువాత పూరి జగన్ ముంబై నుండి హైదరాబాద్ రాలేదని, ముంబై లోనే పూర్తిగా సెటిల్ అయ్యాడని పరిశ్రమలో వార్తలు వస్తున్నాయి.

'లైగర్' డిజాస్టర్ అవటం, పూరి జగన్ కి పెద్ద దెబ్బె తగిలింది అని అంటున్నారు. అతనితో సినిమా చేస్తాను అని చెప్పిన చిరంజీవి (#MegaStarChiranjeevi), ఆ సినిమా ఎప్పుడు ఎలా అనేది మాత్రం క్లారిటీ లేదు ఇంతవరకు. అప్పట్లో 'గాడ్ ఫాదర్' (#GodFather) సినిమా ప్రచారం చేస్తున్నప్పుడు పూరి జగన్ (#PuriJagan), చిరంజీవి తో సినిమా చెయ్యడానికి ఉత్సుకత చూపించినప్పటికీ, ఆ ప్రచారాలు అయిపోయాక ఇద్దరూ సైలెంట్ అయిపోయారు. అది ఇప్పట్లో జరిగేది కూడా కాదు అని అంటున్నారు.

అయితే పూరి జగన్ ఇంతకు ముందు విజయవంతమయిన సినిమా 'ఇస్మార్ట్ శంకర్' (#iSmartShankar) సినిమాకి ఒక సీక్వెల్ తీయాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. దానికి టైటిల్ కూడా 'ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్' (#UstadiSmartShankar) అని పెట్టాలని, దాని కోసమని పూరి జగన్, రామ్ పోతినేని (#RamPothineni) సంప్రదించగా అతను దీనికి ఒకే చెప్పినట్టుగా తెలిసింది. ఎందుకంటే 'ఇస్మార్ట్ శంకర్' సినిమా రామ్ పోతినేని, పూరి జగన్ కి చాలా పెద్ద విజయం అందించింది. ఆ విశ్వాసం తోటే రామ్ మళ్ళీ పూరి జగన్ ని నిలబెట్టడానికి ఆ సినిమా సీక్వెల్ లో చెయ్యడానికి ఒప్పుకున్నాడు అని తెలిసింది. కానీ దీని మీద ఇంకా క్లారిటీ రావాల్సి వుంది. ఎందుకంటే ప్రస్తుతం రామ్, దర్శకుడు బోయపాటి శ్రీను తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అయ్యాక రామ్ 'ఇస్మార్ట్ శంకర్' సీక్వెల్ గురించి మాట్లాడుతాడు అని తెలుస్తోంది.

Updated Date - 2023-03-01T14:48:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!