ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Prince: స్టార్ డైరెక్టర్ చిత్రంలో విలన్ రోల్

ABN, First Publish Date - 2023-02-06T19:44:59+05:30

తేజ డైరెక్షన్‌లో వెండితెరకు పరిచయం అయిన వ్యక్తి ప్రిన్స్ (Prince). ‘నీకు నాకు డాష్ డాష్’ (Neeku Naaku Dash Dash) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ‘బస్ స్టాప్’ (Bus Stop), ‘నేను శైలజ’ (Nenu Sailaja) వంటి చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తేజ డైరెక్షన్‌లో వెండితెరకు పరిచయం అయిన వ్యక్తి ప్రిన్స్ (Prince). ‘నీకు నాకు డాష్ డాష్’ (Neeku Naaku Dash Dash) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ‘బస్ స్టాప్’ (Bus Stop), ‘నేను శైలజ’ (Nenu Sailaja) వంటి చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. తాజాగా ఆయన లక్కీ ఛాన్స్ కొట్టేశారు. టాప్ డైరెక్టర్ దర్శకత్వంలో నటించే అవకాశాన్ని చేజిక్కించుకున్నారు. స్టార్ హీరో చిత్రంలో విలన్ పాత్రను చేయనున్నారు.

యంగ్, డైనమిక్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni), బోయపాటి శ్రీనివాస్ (Boyapati Srinivas) కలసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం పాన్ ఇండియాగా రూపొందుతుంది. శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ప్రిన్స్ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు. ఈ రోల్ సినిమాకు హైలెట్ కానుందని తెలుస్తోంది. ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్‌ను ప్రిన్స్ కోసం బోయపాటి శ్రీనివాస్ రాసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. విలన్ పాత్రలను క్రియేట్ చేయడంలో బోయపాటికి ఓ ప్రత్యేకమైన మార్కు ఉంది. ‘లెజెండ్’ లో జగపతి బాబు రోల్‌ను, ‘అఖండ’ లో శ్రీకాంత్ రోల్‌ను ఆ విధంగా రూపొందిచారు. అయితే, ఈ సినిమాలో ప్రిన్స్ పాత్రను ఏ విధంగా క్రియేట్ చేశారో తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే. బోయపాటి, రామ్ సినిమాలో అదిరిపోయే ఐటెం సాంగ్ కూడా ఉంది. ఈ పాటకు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ క్రేజీ ట్యూన్స్ ఇచ్చాడట. ఈ పాటను బాలీవుడ్ అందాల భామ ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) చేయనున్నారు.

Updated Date - 2023-02-06T19:51:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising