Bihar: నడిరోడ్డుపై ఇరుక్కున్న విమానం.. ఆ తరువాత ఏమైందంటే?
ABN, Publish Date - Dec 30 , 2023 | 12:10 PM
నడిరోడ్డుపై విమానం ఇరుక్కుపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా(Social Media)లో వైరల్ గా మారాయి. అదేంటి విమానం రోడ్డుపైకి ఎందుకొచ్చింది అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వార్త చదవాల్సిందే.
పట్నా: నడిరోడ్డుపై విమానం ఇరుక్కుపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో (Social Media) వైరల్‌గా మారాయి. అదేంటి విమానం రోడ్డు బ్రిడ్జి కింద ఇరుక్కుపోవడం ఏంటని ఆలోచిస్తున్నారా? అయితే ఈ పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిందే. ముంబయిలో తయారుచేసిన ఓ విమానాన్ని(Aeroplane) అసోంకు ట్రక్కులో తరలిస్తుండగా ఈ పరిణామం చోటుచేసుకుంది. ట్రక్కు బిహార్‌లోని పిప్రకోఠి ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద విమాన పైభాగం తగిలి ఇరుక్కుపోయింది.
డ్రైవర్ ఎంతలా ప్రయత్నించినా ట్రక్కు ముందుకు కదల్లేదు. దీంతో జాతీయ రహదారి-27పై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. విమానాన్ని చూడటానికి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తరలివచ్చారు. చివరికి సహాయక సిబ్బంది అక్కడికి చేరుకుని విమానాన్ని సేఫ్ గా బయటకి వచ్చేలా చేశారు.
బ్రిడ్జి ఎత్తును తక్కువగా ఉందని భావించిన డ్రైవర్ ట్రక్కును ముందకు పోనించినట్లు తెలుస్తోంది. విమానానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2022 నవంబర్ లో ఏపీలోని బాపట్ల జిల్లా జాతీయ రహదారి అండర్ పాస్ పై కూడా ఇలాంటి ఘటనే జరిగింది.
"మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి"
Updated Date - Dec 30 , 2023 | 01:02 PM