ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

#MeToo: నటిని బాత్రూమ్ వరకు ఫాలో అయిన నిర్మాత.. తలుపులు తెరవడానికి ప్రయత్నిస్తే ఏం జరిగిందంటే..

ABN, First Publish Date - 2023-02-26T11:01:45+05:30

రంగమేదైనా మహిళలపై లైంగిక వేధింపులు సాధారనమైపోయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో అయితే ఇలాంటి ఘటనలు కొంచెం ఎక్కువనే చెప్పాలి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగమేదైనా మహిళలపై లైంగిక వేధింపులు సాధారనమైపోయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో అయితే ఇలాంటి ఘటనలు కొంచెం ఎక్కువనే చెప్పాలి. అయితే, ఇటీవలకాలంలో చాలామంది నటీమణులు మీటూ ఉద్యమంలో భాగంగా బయటికి వస్తూ తమకి జరిగిన వేధింపుల గురించి బహిరంగ పరుస్తున్నారు. ఈ తరుణంలోనే ప్రముఖ హాలీవుడ్ నిర్మాత హార్వే వైన్‌స్టెయిన్‌ (Harvey Weinstein)పై పలువురు మహిళలు లైంగిక ఆరోపణలు చేశారు. తాజాగా అమెరికాకి చెందిన మీడియా పర్సన్, బిజినెస్ ఉమెన్ పారిస్ హిల్టన్ (Paris Hilton) కూడా అతనిపై విమర్శలు చేసింది.

చాలా ఏళ్ల క్రితం జరిగిన హార్వేతో జరిగిన ఈ భయంకర సంఘటన గురించి పారిస్ హిల్టన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అందులో హిల్టన్ మాట్లాడుతూ.. ‘గాలాకు ముందు రోజు నేను వైన్‌స్టీన్‌ను కలిశా. అప్పుడు నాకు కేవలం 19 ఏళ్లు మాత్రమే. ఆ సమయంలో నేను నా ఫ్రెండ్‌తో లంచ్‌ చేస్తున్నాను. అప్పుడు అతను నా టేబుల్‌ పైకి వచ్చి.. మీరు నటి కావాలనుకుంటున్నారా? అని అడిగాడు. నేను అవునని చెప్పాను. అప్పుడు నేను టీనేజీలో ఉండడం వల్ల అతని మాటతీరు చూసి.. చాలా మంచివాడని అనుకున్నాను. అప్పుడే అతను తన గదికి వచ్చి సినిమా వచ్చి స్క్రిప్ట్‌లు చదవమని చెప్పాడు. కానీ అది నాకు నచ్చలేదు. అందుకే నేను వెళ్లలేదు.

ఇది కూడా చదవండి: Kate Winslet: భర్త ముందే మరొకరితో శృంగార సన్నివేశాలు.. ఎలా ఫీల్ అయ్యిందో చెప్పిన టైటానిక్ బ్యూటీ

దాని వల్ల మరుసటి రోజు రాత్రి నాతో చాలా దురుసుగా ప్రవర్తించాడు. నేను బాత్రూమ్‌లోకి వెళ్లాను. అది గమనించిన అతను నన్ను ఫాలో అయ్యాడు. చాలాసేపు బాత్రూమ్ డోర్ కొట్టాడు. నేను తెరవకపోవడంతో బలవంతంగా తెరవడానికి ప్రయత్నించాడు. భయంతో అలాగే ఉండిపోయాను. ఆ సమయంలో సెక్యూరిటీ వచ్చి అతన్ని అక్కడి నుంచి లాక్కెళ్లిపోయారు’ అని చెప్పుకొచ్చింది.

హిల్టన్ చేసిన ఆరోపణలపై హార్వే వైన్‌స్టెయిన్‌ ప్రతినిధి స్పందిస్తూ.. ‘హాలీవుడ్‌లో బాగా పాపులారిటీ ఉన్న వ్యక్తిఫై ఇలాంటి ఆరోపణలు సాధారణం. హిల్టన్‌తో హార్వే చాలా మర్యాదగానే ప్రవర్తించారు. కానీ ఆమె ఎందుకు అలాంటి ఆరోపణలు చేసిందో తెలీదు’ అని చెప్పుకొచ్చాడు.

Updated Date - 2023-02-26T11:01:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising