Amazing: ఇదెక్కడి వింత బాబోయ్.. ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇస్తే నాలుగేళ్ల తర్వాత చేరుకున్న పార్శిల్..!
ABN, First Publish Date - 2023-06-24T15:11:33+05:30
ప్రస్తుత డిజిటల్ యుగంలో చాలా పనులు ఆన్‌లైన్ ద్వారానే అయిపోతున్నాయి. ఇంట్లో కూర్చునే చాలా మంది షాపింగ్ చేసేస్తున్నారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ సైట్ల ద్వారా తమకు కావాల్సిన వస్తువులను ఇంటికే రప్పించుకుంటున్నారు.
ప్రస్తుత డిజిటల్ యుగంలో చాలా పనులు ఆన్‌లైన్ ద్వారానే అయిపోతున్నాయి. ఇంట్లో కూర్చునే చాలా మంది షాపింగ్ (Online Shopping) చేసేస్తున్నారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ సైట్ల ద్వారా తమకు కావాల్సిన వస్తువులను ఇంటికే రప్పించుకుంటున్నారు. కేవలం ఒక్క క్లిక్ చేస్తే మనకు కావాల్సిన వస్తువు రెండు, మూడు రోజుల్లో ఇంటికి వచ్చేస్తుంది. ఒకవేళ అలా రాకపోతే మాత్రం కాస్త ఆందోళనకు గురవుతారు. అలాగే ఆన్‌లైన్ ద్వారా ఓ వస్తువు కోసం ఆర్డర్ చేసిన వ్యక్తికి నాలుగేళ్ల తర్వాత పార్శిల్ చేరింది (Parcel reached home after 4 years).
ఢిల్లీ (Delhi)కి చెందిన ఒక వ్యక్తి వెబ్‌సైట్‌లో వస్తువులను ఆర్డర్ చేసి 4 సంవత్సరాల తర్వాత తన వస్తువులను పొందాడు. ఢిల్లీకి చెందిన టెక్కీ నితిన్ అగర్వాల్ 2019లో అలీ ఎక్స్‌ప్రెస్ (Ali Express) ద్వారా ఒక వస్తువును ఆర్డర్ చేశాడు. కానీ ఎన్ని రోజులు గడిచినా పార్సిల్ డెలివరీ కాలేదు. ఆ తర్వాత ఆ ఆన్‌లైన్ యాప్ భారత్‌లో నిషేధానికి గురైంది. దాంతో నితిన్ తను ఆర్డర్ చేసిన పార్శిల్ గురించి మర్చిపోయాడు. అయితే ఆశ్చర్యకరంగా ఆ పార్శిల్ తాజాగా నితిన్ ఇంటికి చేరుకుంది. షాకైన నితిన్ ఆ విషయాన్ని ట్విటర్ ద్వారా పంచుకున్నాడు.
Heartbreaking Video: ఆ పక్షి చనిపోయిందని తెలియక.. ఎందుకు లేవడం లేదో దానికి అర్థం కాక.. నెటిజన్లను కట్టిపడేస్తున్న వీడియో..!
``ఎప్పుడూ ఆశ కోల్పోవద్దు. ఆ పార్శిల్ కోసం నేను 2019లో అలీ ఎక్స్‌ప్రెస్ (ప్రస్తుతం భారత్‌లో నిషేధంలో ఉంది) ద్వారా ఆర్డర్ ఇచ్చాను. ఇప్పుడు ఇంటికి చేరింద``ని నితిన్ ట్వీట్ చేశాడు. అలాగే చైనీస్‌లో రాసి ఉన్న పార్శిల్ ఫొటోను కూడా పంచుకున్నాడు. నితిన్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు దాదాపు 70 వేల మంది ఆ ట్వీట్‌ను చూశారు.
Updated Date - 2023-06-24T15:11:33+05:30 IST