ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NTR 30: ఎన్‌టీఆర్, కొరటాల సినిమాకు ముహుర్తం ఫిక్స్.. హీరోయిన్ ఎవరంటే..?

ABN, First Publish Date - 2023-02-13T19:46:39+05:30

తన నటన, డిక్షన్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు జూనియర్ ఎన్‌టీఆర్ (Junior NTR). ఆయనకు యూత్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తారక్ నుంచి సినిమా వస్తుందంటే చాలు అభిమానులందరు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తన నటన, డిక్షన్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు జూనియర్ ఎన్‌టీఆర్ (Junior NTR). ఆయనకు యూత్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తారక్ నుంచి సినిమా వస్తుందంటే చాలు అభిమానులందరు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ప్రస్తుతం ఆయన కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్టు వర్కింగ్ టైటిల్‌గా ‘ఎన్‌టీఆర్ 30’ (NTR 30) అని వ్యవహరిస్తున్నారు. ఈ మూవీకి ముహుర్తం ఫిక్సయినట్టు సమాచారం అందుతుంది. హీరోయిన్ కూడా ఫిక్సయినట్టు తెలుస్తోంది.

‘ఎన్‌టీఆర్ 30’ యాక్షన్ డ్రామాగా రూపొందుతుంది. ఈ సినిమా ఫిబ్రవరి 23న పూజా కార్యక్రమాలు జరుపుకొనుందని ఫిల్మ్ నగర్ వర్గాలు తెలుపుతున్నాయి. ఆరు నుంచి ఏడు నెలల్లో మూవీ షూటింగ్ పూర్తి కానుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్‌గా నటించనున్నారు. ఈ సినిమాతోనే టాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనున్నారు. అందుకు సంబంధించిన అధికారక ప్రకటన త్వరలోనే రానుందని సమాచారం అందుతుంది. ‘ఎన్‌టీఆర్ 30’ కి కొరటాల శివ (Kortala Siva) దర్శకత్వం వహిస్తున్నారు. యువ సుధా ఆర్ట్స్ భారీ బడ్జెట్‌తో రూపొందిస్తుంది. పాన్ ఇండియాగా నిర్మిస్తుంది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మార్చి 20 లేదా అంతకంటే ముందే ప్రారంభం కానుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 5న విడుదల కానుంది. ‘ఎన్‌టీఆర్ 30’ లో పవర్ ఫుల్ విలన్ రోల్ ఉంది. ఆ పాత్ర కోసం మేకర్స్ సైఫ్ అలీ ఖాన్, ‘చియాన్’ విక్రమ్ లతో సంప్రదింపులు జరుపుతున్నారు. వారికి స్క్రిఫ్ట్‌ను వినిపించగా ఆసక్తి కనబరిచినట్టు సమాచారం. కాంట్రాక్ట్‌పై మాత్రం ఎవరూ సంతకం చేయలేదు. ఈ చిత్రం తర్వాత ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో నటించనున్నారు. గ్యాంగ్ స్టర్ డ్రామాగా సినిమా రూపొందనుంది.

Updated Date - 2023-02-13T19:46:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising