ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

south Indian Restaurant : ఈ రెస్టారెంట్ లో పూర్తిగా పచ్చి భోజనాన్ని తినాల్సిందే...!

ABN, First Publish Date - 2023-01-31T10:43:17+05:30

ఇక్కడ వజైపూ వడై, పొడి గింజలు, మెత్తగా రుబ్బిన అరటి పువ్వుల మిశ్రమంతో మెత్తగా ఉంటుంది

No Oil, No Boil Restaurant
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘నో ఆయిల్, నో బాయిల్’ రెస్టారెంట్‌లో, మీ ప్లేట్‌లోని ప్రతిదీ పూర్తిగా పచ్చిగా ఉంటుంది. అవును, ఇందులో వడ, పాయసం కూడా ఉన్నాయి..! కోయంబత్తూరులోని పడయాల్ అనే రెస్టారెంట్ పూర్తిగా పచ్చి భోజనాన్ని అందిస్తుంది. ఈ రెస్టారెంట్ ప్రత్యేకతే నూనె లేదు. ఉడకబెట్టటం అంతకన్నా లేదనే ట్యాగ్ లైన్ తో ప్రసిద్ధి చెందింది, ఇదంతా నిజమే.. అంతేనా వడతో సహా ప్రతీదీ పచ్చిగా ప్లేట్ లో వడ్డించడం అంటే ఊహించుకోండి. అవి రుచి ఉండవేమోననే అనుమానం ఏం అవసరం లేదు.. రెండేళ్ళనాటి ఈ రెస్టారెంట్ స్థాపించింది ఆర్. శివకుమార్ ఇతను శాస్త్రవేత్త, పైగా రైతు కుటుంబంలో పుట్టాడు. ఇక ఈయన రెస్టారెంట్ అంతా రైతు ఉద్యమకారుడైన జయరామన్ చిత్రాలు గోడల నిండా కొలువుదీరి ఉంటాయి.

ఎవరైనా ఆరోగ్యం ఆహారం అని మాట్లాడటం మొదలు పెడితే వెంటనే గుర్తుకు వచ్చేవి సలాడ్ లే. అయితే దీనికి రీప్లేస్ మెంట్ గా ఏదైనా చేయాలనుకున్నప్పుడు తనకు తట్టిన ఐడియా ప్రతిఫలమే ఇప్పుడు శివకుమార్ నిర్వహిస్తున్న పడయాల్ రెస్టారెంట్. ఇందులో బిర్యానీ, శాండ్ విచ్, పొంగల్, పుట్టు అంటూ 2, 200 రకాల వంటకాలున్నాయి. అన్నీ నూనె, ఉడకబెట్టటం వంటివి లేకుండా తయారు చేసినవే. అవన్నీ పచ్చివే.

ఈ మధ్యాహ్న భోజనంలో అవల్ (చదునైన అన్నం)తో పాటు తురిమిన క్యారెట్ ముక్కలను అన్నం స్థానంలో వడ్డిస్తారు. తురిమిన కొబ్బరితో మెత్తగా తరిగిన బీట్‌రూట్ 'పోరియల్'; 'పచ్చడి' మెత్తగా తరిగిన పొట్లకాయతో తయారు చేస్తారు. సాంబార్ చిక్కగా, క్రీమీగా ఉంటుంది. పులి కుజంబు సాధారణంగా చేసే విధంగా నూనెలో ఈదదు, జామకాయ రసం నీళ్లతో ఉంటుంది, అయితే ఇది కొత్త ప్రయోగం అని మాత్రం అనుకుంటే పొరపాటే అంటారు శివకుమార్. సనాతన ఆయుర్వేదంలో పచ్చి కూరలను, ఆహారంగా తీసుకోవడం అనేది ఉందని., దానికి మోడ్రన్ రూపాన్ని మాత్రమే తను ఇచ్చానని శివకుమార్ చెపుతారు.

ఇది కూడా చదవండి: ఇది లోపిస్తే గందరగోళంతో పాటు ఏకాగ్రతలో ఇబ్బంది కలిగి...!

ఇక్కడ వళ్ళైపూ వడై, పొడి గింజలు, మెత్తగా రుబ్బిన అరటి పువ్వుల మిశ్రమంతో మెత్తగా ఉంటుంది, తేలికపాటి తీపి రుచిని ఇస్తుంది. 'మజ్జిగ'లో కొబ్బరి పాలు, గుమ్మడికాయ గింజలు ఉంటాయి. శివకుమార్ గత పదేళ్లుగా ఆర్‌ అండ్‌ డీలో పాదయాత్రలో పాల్గొన్నారు.. నమ్మాళ్వార్ వనగం కేంద్రాన్ని సందర్శించినప్పుడు. ఆ సమావేశానికి భారతదేశం అంతటా సేంద్రీయ వ్యవసాయ మార్గదర్శకులు నలుమూలల నుంచి వచ్చారు. ఆ రోజు మధ్యాహ్న భోజనంలో అందరికీ, పచ్చి భోజనం అందించారు, అప్పుడు పుట్టిన ఆలోచనే ఇలా పచ్చి ఆహారాన్ని ప్రజలకు అందించాలనే సంకల్పంగా రూపుదాల్చింది. దీనికి సంబంధించిన సాంకేతికతపై సమాచారాన్ని సేకరించడం ప్రారంభించి, తమిళనాడు అంతటా వివిధ ప్రాంతాలకు వెళ్ళేలా చేసింది. ఆ తరువాతే శివకుమార్ క్రమంగా తన స్వంత వంటకాలను రూపొందించడం ప్రారంభించాడు.

శివకుమార్ వెల్లడించిన రహస్య పదార్ధం జీడిపప్పు ,కొబ్బరి పేస్ట్. ఇది కూరలకు స్థిరత్వాన్ని ఇస్తుంది, ఈ పచ్చి వంటకాలను ఇష్టపడిన వారికి శివకుమార్ ఔట్ డోర్ క్యాటరింగ్ కూడా చేస్తుంటాడు. సంవత్సరాలుగా వివిధ కార్యక్రమాలకు వడ్డించి పెట్టాడు కూడా. ఈ వంటలపై ఆసక్తి ఉన్నవారికి నేర్పించేందుకు కూడా శివకుమార్ సిద్ధంగా ఉన్నారు.

Updated Date - 2023-01-31T14:50:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising