ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Marriage: వధువు చేతిని పట్టుకుని నడుస్తూ ఉండగా.. సడన్‌గా వరుడి మెడపై కత్తి.. పెళ్లిలో క్రైమ్ థ్రిల్లర్‌ను తలపించే సీన్..!

ABN, First Publish Date - 2023-06-26T20:19:48+05:30

గుడిలో నూతన వధువును కిడ్నాప్ చేసిన ఘటన రాజస్థాన్‌లో వెలుగులోకి వచ్చింది. భర్తను కత్తితో బెదిరించిన దుండుగులు కొత్త పెళ్లికూతురిని బలవంతంగా ఎత్తుకెళ్లిపోయారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల కాలంలో జరుగుతున్న పెళ్లిళ్లల్లో అసాధారణ ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా ఓ వివాహంలో క్రైమ్ థ్రిల్లర్‌ను తలపించే ఘటన ఒకటి చోటుచేసుకుంది. కొత్తగా పెళ్లి చేసుకున్న జంట తమ కుటుంబంతో కలిసి గుడికి వెళ్లగా కొందరు దుండగులు ఆమెను కిడ్నాప్ చేశారు. వరుడు, అతడి కుటుంబసభ్యుల మెడపై కత్తి పెట్టి కొత్త పెళ్లికూతురిని బలవంతంగా తీసుకెళ్లిపోయారు. రాజస్థాన్‌లో(Rajasthan) భిల్వారా జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది.

జిల్లాలోని సుభాష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే రవికి శుక్రవారం స్థానిక యువతితో వివాహమైంది. మరుసటి రోజు నూతన దంపతులు తమ ఇంటి సమీపంలోని గుడికి వెళ్లారు. వారి వెంట యువకుడి తల్లిదండ్రులూ వెళ్లారు. కొత్త జంట ఒకరి చేయీచేయీ కలిపి నడుచుకుంటూ వెళుతుండగా కొందరు దొండగులు అకస్మాత్తుగా బైకులపై వచ్చారు. రవిని, అతడి కుటుంబసభ్యుల గొంతుపై కత్తి పెట్టి బెదిరించి యువతిని బలవంతంగా పక్కకు లాగేశారు. వారు తేరుకునేలోపే యువతిని మరో బైక్‌పై బలవంతంగా ఎక్కించుకుని తీసుకెళ్లిపోయారు(Newly wed girl kidnapped at knife point).

ఆ తరువాత రవి, అతడి కుటుంబసభ్యులు యువతి కోసం ఎంత వెతికినా ఉపయోగం లేకపోయింది. యువతి ప్రేమికుడే ఈ దారుణానికి తెగబడి ఉంటాడని భావించిన వారు చివరకు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన స్థానికంగా పెను సంచలనానికి దారి తీసింది. పోలీసులు యువతి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.

Updated Date - 2023-06-26T20:25:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising