ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: కొండచిలువపై స్వారీ.. ఐదేళ్లు కూడా లేని బుడతడి సాహసం..!

ABN, Publish Date - Dec 24 , 2023 | 07:36 PM

కొండచిలువపై స్వారీ చేసిన ఓ బుడ్డోడి వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్లను షాక్‌కు గురి చేస్తోంది.

ఇంటర్నెట్ డెస్క్: నాగు పాము, కొండచిలువలతో ఎంతటి ప్రమాదమో మాటల్లో చెప్పడం కష్టం. అవి దాడి చేసేందుకు డిసైడైతే చావు తప్పదు. కానీ, కొందరు మాత్రం ప్రమాదకర జంతువులతో ఆటలు ఆడుతుంటారు. జంతు సంరక్షకులు ఇలాంటి సాహసాలకు పూనుకుంటే ఏదోలే అనుకోవచ్చు కానీ సామాన్యులు.. ముఖ్యంగా చిన్నపిల్లలు ఇలాంటి దుస్సాహసాలకు పూనుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే. అందుకే ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral Video) మారింది. జనాలను షేక్ చేస్తోంది.


వీడియోలో కనిపించిన దాని ప్రకారం, కనీసం ఐదేళ్లు కూడా లేనట్టు ఉన్న ఓ బుడ్డోడు ఏకంగా కొండ చిలువతోనే చలగాటమాడాడు. దానిపై సోఫాలో కూర్చున్నట్టు కూర్చున్నాడు. దాని మీదెక్కి స్వారీగా కూడా చేశాడు. ఏదో కుక్క పిల్లతో ఆడుకున్నట్టు ఆ పాముతో రకరకాల ఆటలు ఆడాడు (kids rides on a python).


ఈ షాకింగ్ దృశ్యాలు చూసిన నెటిజన్లు భయభ్రాంతులకు లోనవుతున్నారు. పాముకు తిక్కరేగితో బుడ్డోడిని అమాంతం మింగేయగలదని ఆందోళన వ్యక్తం చేశారు. బుడ్డోడిని ఇలా ప్రమాదంలోకి నెట్టిన తల్లిదండ్రులపై కూడా దుమ్మెత్తిపోశారు. ఆధునిక జీవితం అలవాటైన ప్రజలు అడవి జంతువులతో వచ్చే ప్రమాదాల గురించి దాదాపుగా మర్చిపోయారని, అందుకే ఇలాంటి దుస్సాహసాలకు పూనుకుంటున్నారని కొందరు అభిప్రాయపడ్డారు. నెటిజన్లను బాగా టెన్షన్ పెడుతున్న ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట రచ్చ రచ్చ చేస్తోంది.

Updated Date - Dec 24 , 2023 | 07:43 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising