ఇదెక్కడి వింత.. వేప చెట్టు నుంచి కారుతున్న పాలు.. ప్రసాదం అంటూ ఇళ్లకు తీసుకెళ్తున్న భక్తులు..!
ABN, First Publish Date - 2023-01-21T18:53:15+05:30
యూపీలోని (Uttar Pradesh) కౌశంబి జిల్లాలో ఓ ఆశ్చర్యకర ఘటన వెలుగులోకి వచ్చింది. జలాల్‌పూర్ ఘోసి గ్రామంలోని వేప చెట్టు నుంచి పాలు కారుతున్నాయి (Milk coming from Neem Tree). ఈ వార్త సమీప గ్రామాల్లో దావానలంలా వ్యాపించింది. దీంతో ఆ వింతను చూడడానికి ప్రజలు క్యూ కడుతున్నారు.
యూపీలోని (Uttar Pradesh) కౌశంబి జిల్లాలో ఓ ఆశ్చర్యకర ఘటన వెలుగులోకి వచ్చింది. జలాల్‌పూర్ ఘోసి గ్రామంలోని వేప చెట్టు నుంచి పాలు కారుతున్నాయి (Milk coming from Neem Tree). ఈ వార్త సమీప గ్రామాల్లో దావానలంలా వ్యాపించింది. దీంతో ఆ వింతను చూడడానికి ప్రజలు క్యూ కడుతున్నారు. ఈ ఘటనను ఒక అద్భుతంగా (Miracle) భావించి, ప్రజలు ఆ చెట్టును పూజించడం ప్రారంభించారు. ప్రతిరోజూ చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ప్రజలు ఆ చెట్టును చూసేందుకు వస్తున్నారు (Viral News).
జలాల్‌పూర్ ఘోసి గ్రామంలోని సంవత్సరాల నాటి వేప చెట్టు నుండి తెల్లటి పాలలాంటి ద్రవం రావడం ప్రారంభించింది. ఈ విషయం తెలిసుకున్న స్థానిక ప్రజలు అక్కడికి పరుగులు తీశారు. ఆ చెట్టును పూజించడం ప్రారంభించారు. చెట్టు నుంచి కారుతున్న పాలను ప్రసాదంగా భావించి ఇళ్లకు తీసుకెళ్తున్నారు. వేప చెట్టు నుంచి పాలు కారడం వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్‌ను నిపుణులు చెబుతున్నప్పటికీ ప్రజలు దానిని వినడానికి ఇష్టపడడం లేదు.
వేప చెట్టు నుంచి పాల లాంటి పదార్థం రావడానికి గల కారణాన్ని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. భూమి నుంచి వేరు భాగం గ్రహించే పోషకాలను xylem అనే కణజాలం మొక్క కాండానికి, ఇతర భాగాలకు సరఫరా చేస్తుంది. ఒక్కోసారి ఈ కణజాలం పగిలిపోతే చెట్టు నుంచి పాల లాంటి పదార్థం బయటకు వస్తుంది. అంతే తప్ప అందులో ఎలాంటి మహిమలూ లేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Updated Date - 2023-01-21T18:53:16+05:30 IST