ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: హిందీపై ఆగ్రహం.. మెట్రో రైల్లో యువకుడు చేసిన పనిపై నెటిజన్ల వార్..!

ABN, First Publish Date - 2023-01-31T15:50:55+05:30

దక్షిణ భారతదేశానికి చెందిన తమ ప్రాంతీయ భాషల పట్ల చాలా మక్కువగా ఉంటారు. కేంద్ర ప్రభుత్వం తమపై హిందీని బలవంతంగా రుద్దుతోందని భావిస్తుంటారు. ముఖ్యంగా తమిళ, కన్నడ ప్రజల్లో ఈ భావన ఎక్కువగా ఉంటుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దక్షిణ భారతదేశానికి చెందిన తమ ప్రాంతీయ భాషల పట్ల చాలా మక్కువగా ఉంటారు. కేంద్ర ప్రభుత్వం తమపై హిందీని బలవంతంగా రుద్దుతోందని భావిస్తుంటారు. ముఖ్యంగా తమిళ, కన్నడ ప్రజల్లో ఈ భావన ఎక్కువగా ఉంటుంది. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియో హిందీపై (Hindi) ఉన్న ఆగ్రహాన్ని కళ్లకు కట్టినట్టు చూపెడుతోంది.

బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ (BMRCL) స్టేషన్లలో, రైళ్లలో ఉండే సైన్‌ బోర్డ్‌లపై గతంలో కన్నడ, ఇంగ్లీష్, హిందీ భాషల్లో సూచనలు ఉండేవి. బెంగుళూరులోని మెట్రో రైళ్లలో కన్నడ, ఇంగ్లీష్ భాషల కింద ఉండే హిందీలోని సూచనలపై (Hindi Sign boards) మెట్రో అధికారులు టేప్ అంటించి వాటిని కనిపించకుండా చేశారు. తాజాగా మెట్రో రైల్‌లో ప్రయాణించిన ఓ యువకుడు దానిని వీడియో తీశాడు. హిందీ భాషపై ఉంచిన టేప్‌లను తొలగించాడు (Man Removes Tape Hiding Hindi Instructions ). ఆ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా (Viral Video) మారింది.

ఈ వీడియోపై సోషల్ మీడియా జనాల మధ్య వార్ జరుగుతోంది. కొందరు హిందీపై టేప్‌లు అంటించిన బెంగళూరు మెట్రోను (Bangalore Metro) ప్రశంసించారు. `ఢిల్లీ మెట్రోలో ఎక్కడా కన్నడ బోర్డులు ఉండవని, మరి బెంగళూరులో మాత్రం హిందీ ఎందుకు ఉండాలని ఒకరు ప్రశ్నించారు. మరికొందరు, భారతదేశంలోని అధికారిక భాషలలో ఒకటైన హిందీని అణిచివేస్తున్నారని విమర్శించారు.

Updated Date - 2023-01-31T19:10:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising