ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Crime: తెల్లవారు ఝామన 4 గంటలకు ఇంట్లోంచి కేకలు.. డాబాపై పడుకున్న 13 ఏళ్ల కొడుకు కిందకు వచ్చి.. తలుపు సందుల్లోంచి తొంగి చూస్తే..!

ABN, First Publish Date - 2023-06-14T16:43:13+05:30

వేసవి కాలం కావడంతో ఆ కుర్రాడు డాబాపై పడుక్కున్నాడు.. తెల్లవారుతుండగా నాలుగు గంటల సమయంలో ఆ కుర్రాడికి ఇంట్లోంచి తల్లి కేకలు వినిపించాయి.. ఏం జరిగిందా అని ఆ కుర్రాడు కిందకు వెళ్లాడు.. లోపల ఆ కుర్రాడి తండ్రి రాక్షసుడిలా కనిపించాడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేసవి కాలం కావడంతో ఆ కుర్రాడు డాబాపై పడుక్కున్నాడు.. తెల్లవారుతుండగా నాలుగు గంటల సమయంలో ఆ కుర్రాడికి ఇంట్లోంచి తల్లి కేకలు వినిపించాయి.. ఏం జరిగిందా అని ఆ కుర్రాడు కిందకు వెళ్లాడు.. లోపల ఆ కుర్రాడి తండ్రి రాక్షసుడిలా కనిపించాడు.. ముందు భార్య గొంతు కోసేశాడు.. ఆ తర్వాత ముగ్గురు కూతుళ్ల గొంతులు కోసేశాడు.. అనంతరం తన గొంతు తానే కోసుకున్నాడు.. అదంతా చూసి భయపడిన కుర్రాడు ఏడుస్తూ ఊళ్లోకి పారిపోయాడు.. బీహార్‌ (Bihar)లోని ఖగారియా జిల్లాలో ఈ దారుణ ఘటన జరిగింది (Crime News).

ఖగారియాకు చెందిన మున్నా యాదవ్ అనే వ్యక్తి ఓ మర్డర్ కేసులో నిందితుడు. పోలీసులు అతడి కోసం వెతుకుతున్నారు. అతడు మాత్రం తప్పించుకు తిరుగుతున్నాడు. సోమవారం రాత్రి 2 గంటల సమయంలో రహస్యంగా ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి వచ్చిన భర్తను భార్య నిలదీసింది. పోలీసులకు లొంగిపోవాలని సూచించింది. ఈ విషయమై భార్యాభర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. భార్య మాటలతో తీవ్ర ఆగ్రహానికి గురైన మున్నా యాదవ్‌లోని రాక్షసుడు బయటకు వచ్చాడు (Bihar Crime News).

Viral Video: శభాష్ పెద్దాయనా.. లాభమే ఆశించకుండా 11 ఏళ్లుగా ఇదే పని.. బైక్‌పై వచ్చి శునకాలకు భోజనం పెడుతూ..!

ఇంట్లోని కత్తితో భార్య గొంతు కోసేశాడు. తల్లి కేకలు విని ఇంట్లో నిద్రిస్తున్న ముగ్గురు ఆడపిల్లలు నిద్ర లేచి కేకలు పెట్టారు. దాంతో ఆ ముగ్గురిని కూడా కనికరం లేకుండా అత్యంత కిరాతకంగా చంపేశాడు. ఆ తర్వాత తనను తాను హతమార్చుకున్నాడు. ఈ ఘటన మొత్తాన్ని అతడి 13 ఏళ్ల కొడుకు చూశాడు. సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి చూసేసరికి గది అంతా రక్తంతో నిండిపోయింది. మొత్తం ఐదు మృతదేహాలను పోలీసులు పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.

Updated Date - 2023-06-14T16:43:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising