ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: శభాష్ పెద్దాయనా.. లాభమే ఆశించకుండా 11 ఏళ్లుగా ఇదే పని.. బైక్‌పై వచ్చి శునకాలకు భోజనం పెడుతూ..!

ABN, First Publish Date - 2023-06-14T15:42:56+05:30

ప్రతిరోజూ మీరు మీ ఇంటి చుట్టూ లేదా మీ వీధిలో కుక్కలు తిరుగుతూ ఉండడం చూసే ఉంటారు. అవి ఇళ్లలోకి వస్తే చాలా మంది కొట్టి తరిమేస్తుంటారు. అయితే కొంతమంది వాటితో కూడా చాలా దయగా వ్యవహరిస్తారు. వాటి ఆకలిని పట్టించుకుంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రతిరోజూ మీరు మీ ఇంటి చుట్టూ లేదా మీ వీధిలో కుక్కలు (Stray Dogs) తిరుగుతూ ఉండడం చూసే ఉంటారు. అవి ఇళ్లలోకి వస్తే చాలా మంది కొట్టి తరిమేస్తుంటారు. అయితే కొంతమంది వాటితో కూడా చాలా దయగా వ్యవహరిస్తారు. వాటి ఆకలిని పట్టించుకుంటారు. తమకు వీలైనప్పుడల్లా వీధి కుక్కులకు ఆహారం అందిస్తారు. అయితే నాగ్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తి మాత్రం ప్రతిరోజూ 150 కుక్కులకు ఆహారం అందిస్తాడు. గత 11 ఏళ్లుగా ఆయన నిర్విరామంగా ఈ పని చేస్తున్నాడు (Man feeds stray dogs every day for 11 years).

@tarana2510 అనే ట్విటర్ యూజర్ ఆ వ్యక్తికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలోని ఓ వ్యక్తి తన బైక్ వెనుక సీటులో బిర్యానీ గిన్నె కట్టుకుని నాగ్‌పూర్‌ (Nagpur) వీధుల్లో తిరిగే దాదాపు 150 కుక్కలకు ప్రతిరోజూ ఆహారం అందిస్తాడు. ప్రతిరోజూ తన పనులు ముగించుకున్న తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 12:30 వరకు వీధి కుక్కులకు ఆహారం అందించే పనిలో ఉంటాడు. ప్రతిరోజూ దాదాపు 35 కేజీల చికెన్ లేదా మటన్ బిర్యానీని ఇలా కుక్కలకు అందిస్తాడు. గత 11 ఏళ్లుగా అతను ఇలా కుక్కల ఆకలి తీరుస్తున్నాడు.

Elephant Video: పాపం.. ఈ ఏనుగుకు ఆకలేసిందనుకుంటా.. స్వీట్ షాపులోకి దూరి మరీ ఏం చేసిందో మీరే చూడండి..!

అతను రాగానే కుక్కలన్నీ ఎంతో సంతోషంగా అతడి చుట్టూ మూగుతున్నాయి. అతడు ప్లేట్లలో బిర్యానీ పెట్టి అన్ని కుక్కలకు అందిస్తున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వ్యక్తి పెద్ద మనసును అందరూ అభినందిస్తున్నారు. ``అతడు ఈ భూమి మీద తిరిగే దేవుడు``, ``అలాంటి వారు ఈ సమాజానికి ఎంతో అవసరం``, ``అతడు నిజంగా గొప్ప పని చేస్తున్నాడు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-06-14T15:42:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising