ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: వామ్మో.. 7 అడుగుల లోతున్న నీటిపై కారు మునగకుండా తోలిన డ్రైవర్.. ఇది మ్యాజిక్కా?

ABN, Publish Date - Dec 18 , 2023 | 09:10 PM

కారంటే రోడ్డు మీద వెళ్లే వాహనం. పడవ నీటిపై ప్రయాణిస్తుంది. కానీ కారును పడవలా నీటిపై తోలితే..! అసాధ్యంలా కనిపిస్తున్న ఈ ఫీట్‌ను ఓ వ్యక్తి సుసాధ్యం చేసి చూపించాడు.

ఇంటర్న్‌ట్ డెస్క్: కారంటే రోడ్డు మీద వెళ్లే వాహనం. పడవ నీటిపై ప్రయాణిస్తుంది. కానీ కారును పడవలా నీటిపై తోలితే..! అసాధ్యంలా అనిపిస్తున్న ఈ ఫీట్‌ను ఓ వ్యక్తి సుసాధ్యం చేసి చూపించాడు. రహదారిపై కారు నడుపుతున్నట్టుగా, 7 అడుగుల లోతున్న నీటిపై కారును తోలాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral Video) మారింది.

వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఆ డ్రైవర్ తొలుత సరస్సులోకి కారును వేగంగా పోనిచ్చాడు. దీంతో, వేగంగా సరస్సులోకి ప్రవేశించిన కారు నీట మునగకుండా ప్రయాణిస్తూ సరస్సుకు అవతలివైపు చేరుకుంది. అస్సలు నమ్మశక్యం కాని విధంగా ఉన్న ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది నిజమో కాదో తెలీక చాలా మంది తికమక పడ్డారు. దీని వెనుక భౌతికశాస్త్ర సూత్రం ఏదైనా ఉందా అని కూడా కొందరు ప్రశ్నించారు (Man drives car on surface of water).


అయితే, ఇదేమీ మ్యాజిక్ కాదని కొందరు తేల్చి చెప్పారు. హైడ్రోప్లేనింగ్ (Hydroplaning) అనే సూత్రం కారణంగా కారు నీటిలో మునిగిపోకుండా ప్రయాణించగలిగింది. ఈ సూత్రం ప్రకారం, నీటిపై ఏటవాలుగా రాయి విసిరినప్పుడు అది పలుమార్లు నీటిని తాకి ఎగిరి పడుతూ ముందుకు వెళుతుంది. అలాగే, వేగంగా వెళుతున్న కారు కూడా నేలకు తాకి పలుమార్లు పైకీకిందకూ పడే బంతిలాలా నీటిపై దూసుకుపోతుందని వివరించారు. అయితే, జనాలు మాత్రం తమ సందేహాలు వెలిబుచ్చుతూనే ఉన్నారు. దీంతో, వీడియో వైరల్‌గా మారింది.

Updated Date - Dec 18 , 2023 | 09:10 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising