ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral: అకస్మాత్తుగా కనకవర్షం.. రూ.10 నోట్లు ఏరుకునేందుకు ఎగబడ్డ జనం..

ABN, First Publish Date - 2023-01-24T20:49:51+05:30

బెంగళూరులో ఓ వ్యక్తి ఫ్లైఓవర్‌పై నిలబడి ప్రజలపై నోట్లు వెదజల్లాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: మనిషి జీవితంలో డబ్బు ఎంతటి కీలక పాత్ర పోషిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే అధిక శాతం మంది డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉంటారు. కానీ.. బెంగళూరులో(Bengaluru) ఓ వ్యక్తి మాత్రం తన డబ్బును ప్రజలపై వెదజల్లాడు. పట్టపగలు.. ఫ్లైఓవర్‌పై నిలబడి బ్యాగు నిండా తెచ్చుకున్న రూ.10 నోట్లను కిందున్న వారిపై విసిరేశాడు. కలాసిపాళ్య ప్రాంతంలో మైసూర్ రోడ్డు ఫ్లై ఓవర్‌పై(Mysore Road Flyover) ఈ వింత ఘటన జరిగింది. నోట్ల వర్షం కురవడంతో రోడ్డుపై(Raining Currency notes) ఉన్న ప్రజలు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఫ్లైఓవర్‌పై నిలబడ్డ వ్యక్తిని చూసి నోరెళ్లబెట్టారు. మరికొందరు.. నోట్లను తీసుకునేందుకు ఎగబడడంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

ఇదంతా చూసిన ట్రాఫిక్ పోలీసులు ఏం జరుగుతోందో అర్థంకాక అలా చూస్తుండిపోయారట. ఈ ఘటనపై డీసీపీ స్పందించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తమ వద్ద లేవని, అన్ని వివరాలు సేకరించాక తెలియజేస్తామని అన్నారు. తాజా సమాచారం ప్రకారం అరుణ్ అనే వ్యక్తి నోట్లు వెదజల్లాడని తెలుస్తోంది. అతడు ఓ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలో పనిచేస్తాడట. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Updated Date - 2023-01-24T20:49:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising