ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెల్లని కోడి గుడ్లను చూసిన కళ్లు... ఈ తరహా గుడ్లను చూస్తే రెప్పలు వేయడం ఆపేస్తాయి... కారణం ఇదే..

ABN, First Publish Date - 2023-05-03T11:33:14+05:30

ఇప్పటివరకూ మనం తెలుపురంగు గుడ్డు(White egg)నే చూసివుంటాం. అయితే ప్రపంచంలోని ఒక దేశంలోని కోళ్లు నీలిరంగు గుడ్లు(Blue eggs) పెడుతుంటాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇప్పటివరకూ మనం తెలుపురంగు గుడ్డు(White egg)నే చూసివుంటాం. అయితే ప్రపంచంలోని ఒక దేశంలోని కోళ్లు నీలిరంగు గుడ్లు(Blue eggs) పెడుతుంటాయి. ఈ రంగులో గుడ్లు పెట్టడం వెనుక ప్రత్యేక కారణం ఉంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని కోళ్లు నలుపు రంగు గుడ్ల(Black eggs)ను కూడా పెడతాయి.

ఈ నలుపు రంగు గుడ్లు ఆరోగ్యానికి ఎంతో మంచివిగా పరిగణిస్తారు. కడక్‌నాథ్ కోడి(Kadaknath Kodi) గుడ్లు నల్లగా ఉంటాయి. ఇవి ఎంతో ఖరీదైనవి. ఈ తెలుపు, నలుపు గుడ్లకు భిన్నంగా నీలిరంగు గుడ్లు కూడా ఉన్నాయని తెలిస్తే, ఎవరూ త్వరగా నమ్మలేరు. ప్రపంచం(world)లోని ఆ ప్రాంతంలో కోళ్లు పెట్టే గుడ్లు నీలి రంగులో ఉండటం వెనుక ఒక ప్రత్యేక కారణం ఉంది. నిజానికి ఈ నీలి రంగు గుడ్లు అరౌకానా(araucana) అనే కోడి పెట్టినవి. ఈ నీలి రంగు గుడ్లు చిలీ దేశంలో కనిపిస్తాయి. వైరస్ దాడుల కారణంగా గుడ్డు ఇలా నీలి రంగులోకి మారుతుందని చెబుతారు. ఈ తరహా గుడ్లు పెట్టే కోడి తొలిసారిగా 1914 సంవత్సరంలో చిలీ దేశంలో కనిపించింది.

స్పానిష్ పక్షి శాస్త్రవేత్త(Spanish ornithologist) సాల్వడార్ కాస్టెల్ ఈ కోడిని చూశారు. చిలీలోని అరౌకానియా ప్రాంతంలో ఈ కోడి అతనికి కనిపించింది. అందుకే దీనికి అరౌకానా అని పేరు పెట్టారు. శాస్త్రవేత్తలు(Scientists) తెలిపిన వివరాల ఇది దేశీయ కోడి రకం. రెట్రోవైరస్ దాడి కారణంగా ఈ గుడ్లు నీలి రంగులో ఉంటాయి. రెట్రోవైరస్‌లు(Retroviruses) కోళ్లలోకి ప్రవేశించి వాటి జన్యువు నిర్మాణాన్ని మారుస్తాయి.

వీటిని EAV-HP అంటారు. ఇలా జన్యువుల నిర్మాణంలో మార్పు కారణంగా కోడి గుడ్ల రంగు మారుతుంది. ఇలావైరస్ సోకినప్పటికీ అవి తినడానికి అనువైనవిగానే ఉంటాయి. ఎందుకంటే వైరస్‌లు గుడ్ల బయటి నిర్మాణాన్ని మాత్రమే ప్రభావితం(affect) చేస్తాయి. ఐరోపా దేశాలు, అమెరికాలో ఈ చికెన్, గుడ్లు చాలా ఉత్సాహంగా తింటారు.

Updated Date - 2023-05-03T11:49:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising