ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేసవిలో బయటకెళ్ళినప్పుడు చెమట పట్టకపోయినా.. ఈ సమస్యలు ఎదురైనా.. ప్రాణానికి ప్రమాదం ముంచుకొచ్చినట్టే..

ABN, First Publish Date - 2023-03-12T17:33:38+05:30

దాంతోపాటు ఈ సమస్యలు కూడా కనిపిస్తే ప్రాణాపాయంలోకి జారుకుంటున్నారని అర్థం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

రాను రాను ఎండల గోల పెరుగుతుందే తప్ప తగ్గడం అంటూ ఉండటం లేదు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది చలి ఎలాగైతే పెరిగిందో.. ఎండలు కూడా అదేవిధంగా పెరుగుతాయనేది నిపుణుల మాట. సాధారణంగా ఎండలోకి వెళ్ళినప్పుడు చెమట పడుతుంది. కానీ అలా చెమట పట్టకుండా ఉంటే మాత్రం చాలా ప్రమాదం. దాంతో పాటు వికారంగానూ, ఆయాసంగానూ అనిపిస్తే ప్రాణాపాయంలోకి జారుకుంటున్నారని అర్థం. ఈ సమస్య గురించి వివరంగా తెలుసుకుంటే..

వేసవికాలం అనగానే చాలామంది నోట వినిపించేమాట వడదెబ్బ. వడదెబ్బ ప్రమాదకరం అనే విషయం అందరికీ తెలిసినా దాని లక్షణాల గురించి ఆ పరిస్థితుల గురించి అవగాహన అయితే ఉండదు. బయటకు వెళ్ళి ఎండలో తిరుగుతున్నప్పుడు శరీరానికి చెమటలు పట్టకపోతే అది వడదెబ్బ లక్షణంగా గుర్తుపెట్టుకోవాలి. మనం పనులు చేసినప్పుడు, ఎండలో ఉన్నప్పుడు చెమట పట్టడం ద్వారా శరీరాన్ని చల్లబరిచే వ్యవస్థ మనలోనే ఉంది. ఇలా చెమటలు పట్టలేదంటే దానర్థం మన శరీరంలో నీటిశాతం లేదని.. దీన్నే డీహైడ్రేషన్ అని అంటున్నాం. ఇలా చెమటలు పట్టకపోవడం వల్ల శరీర ఉష్టోగ్రత 40డిగ్రీల సెల్సియస్ కు పెరుగుతుంది. ఈ సమయంలో ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. శ్వాస చాలా భారంగా మారుతుంది. ఆయాసం కమ్ముకుంటుంది, గుండె వేగం పెరుగుతుంది. వికారంగా అనిపించడం, తల దిమ్మగా మారిపోవడం జరుగుతుంది. వాంతులు అవుతాయి, చివరికి వ్యక్తి స్పృహ తప్పి పడిపోతాడు.

ఈ లక్షణాలన్నీ వడదెబ్బ కొట్టినప్పుడు వ్యక్తులలో కనిపిస్తాయి. ఎవరికైనా ఈ సమస్య ఎదురైనా.. ఈ సమస్య రాకుండా ఉండాలన్నా కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

వడదెబ్బకు చికిత్స ఎలా ఉండాలంటే..

ముఖ్యంగా వడదెబ్బ కొట్టినప్పుడు ఇదేమీ పెద్ద సమస్య కాదులే మనమే చక్కబెట్టేద్దాం అని సొంత వైద్యంతో మేనేజ్ చెయ్యాలని అనుకోకూడదు. అలాగని వైద్యుని దగ్గరకు తీసుకెళ్ళే వరకు వ్యక్తిని అలానే ఉంచకూడదు.

వడదెబ్బ లక్షణాలు కనిపించగానే మొదట వ్యక్తిని ఎండలో నుండి నీడ ఉన్న ప్రదేశంలోకి తీసుకెళ్ళాలి. జనం గుంపుగా చుట్టుకోకుండా వ్యక్తికి గాలి తగిలేలా చూడాలి. టువల్ ను తడి చేసి వ్యక్తి తలమీద ఉంచాలి, నీటిని తాగించాలి. ఇలాంటి సమయంలో ఫ్రిజ్ లో ఉంచిన నీటిని ఇవ్వకూడదు. ఇలా ప్రథమ చికిత్స చేసిన తరువాత వైద్యుని దగ్గరకు తీసుకెళ్ళాలి.

ముందు జాగ్రత్తలు..

వడదెబ్బ అయినా వేరే సమస్య అయినా ముందే చెప్పి రాదు, మనం చేసే కొన్ని నిర్లక్ష్యపు పనుల వల్ల వస్తుంది. వడదెబ్బ రాకుండా ఉండాలంటే చెయ్యాల్సిన మొదటి పని సాధారణ రోజుల్లో కంటే వేసవిలో నీరు అధికంగా తీసుకోవాలి. బయటి ఆహారాలకు బదులు పండ్లు పండ్లరసాలకే ప్రాధ్యాన్యత ఇవ్వాలి. బయటకు వెళ్ళేముందు నీరు సమృద్దిగా తాగాలి, వాటర్ బాటిల్ వెంట ఉంచుకోవాలి. శీతలపానీయాలు తాత్కాలికంగా చల్లగా అనిపించినా అవి శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తాయి కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. చెరకు రసం, పుదీన-నిమ్మరసం, సుగంధి షర్భర్, కొబ్బరినీళ్ళు, పలుచటి మజ్జిగ, సబ్జా నీరు, బూడిదగుమ్మడిరసం, కలబంద జ్యూస్, ఉసిరికాయ జ్యూస్ వంటివి అద్భుతంగా పనిచేస్తాయి. వీటిలో ఒకటో, రెండో.. రోజూ తీసుకుంటూ ఉండాలి.

వదులుగా ఉన్న కాటన్ దుస్తులు ధరించాలి. లేతరంగులు ఎండకు తొందరగా వేడెక్కవు కాబట్టి అలాంటివి వేసుకోవాలి. ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో వీలైనంత వరకు బయటకు వెళ్ళకపోవడం మంచిది.

Read also: తాళి కట్టే సమయానికి వరుడి పరిస్థితి చూసి నేరుగా పోలిస్ స్టేషన్ కు వెళ్ళిన వధువు.. అతను ఏం చేశాడంటే..


Updated Date - 2023-03-12T17:35:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising