Hair cutting: విద్యార్థులకు హెయిర్ కటింగ్ చేయించిన హెచ్‌ఎం
ABN, First Publish Date - 2023-02-24T10:23:30+05:30
విచిత్రమైన హెయిర్ కటింగ్‌లతో పాఠశాలకు వస్తున్న విద్యార్థులకు ప్రధానోపాధ్యాయుడు వినూత్న శిక్ష వేశాడు. అన్నా
వేలూరు(చెన్నై): విచిత్రమైన హెయిర్ కటింగ్‌లతో పాఠశాలకు వస్తున్న విద్యార్థులకు ప్రధానోపాధ్యాయుడు వినూత్న శిక్ష వేశాడు. అన్నాసాలైలోని ఊరీసు ఉన్నత పాఠశాలలో 1,000 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. వారిలో కొందరు వివిధ రకాల హెయిర్ స్టైల్‌తో పాఠశాలకు వస్తున్నారు. ఇలాంటి కటింగ్ వద్దని హెచ్‌ఎం ఎబినేశన్ పలుమార్లు వారిని మందలించినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో, గురువారం ఉదయం ముందుగానే క్షురకులను సిద్ధం చేసిన ప్రధానోపాధ్యాయుడు విచిత్ర కటింగ్‌తో వచ్చిన వారికి వరుసగా కటింగ్ చేయించారు. తప్పించుకు పారిపోయిన విద్యార్థులను పట్టుకొని వచ్చి మరీ కటింగ్ చేయించారు. విద్యార్థులు యూనిఫాం, చక్కటి హెయిర్ కటింగ్‌తో పాఠశాలకు రావాలని ఆయన సూచించారు.
Updated Date - 2023-02-24T10:23:31+05:30 IST