ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gopichand 31: హై-ఆక్టేన్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌!

ABN, First Publish Date - 2023-03-03T15:51:58+05:30

గోపీచంద్‌ (Macho star Gopichand) హీరోగా నూతన చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఆయన నటిస్తున్న31వ చిత్రమిది. కన్నడ దర్శకుడు ఎ హర్షశ్రీ (A HArsha) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

గోపీచంద్‌ (Macho star Gopichand) హీరోగా నూతన చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఆయన నటిస్తున్న31వ చిత్రమిది. కన్నడ దర్శకుడు ఎ హర్షశ్రీ (A HArsha) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సత్యసాయి ఆర్ట్స్‌ (Satya sai Arts)పతాకంపై కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్నారు. అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు లాంఛనంగా జరిగాయి. నిర్మాత మాట్లాడుతూ ‘‘కన్నడలో పలు హిట్‌ చిత్రాలు తీసిన హర్ష ఈ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నారు. గోపీచంద్‌ ఇంతకు ముందు కొన్ని హై-ఆక్టేన్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్స్‌ చేసినప్పటికీ, ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుంది. చక్కని ఫ్యామిలీ ఎమోషన్స్‌, కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో కూడిన మాస్‌ సినిమా ఇది. ఈ నెలలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుపెడతాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి స్వామి జే సినిమాటోగ్రాఫర్‌ కాగా, కేజీఎఫ్‌ ఫేమ్‌ రవి బస్రూర్‌ సంగీతం అందిస్తున్నారు. రమణ వంక ప్రొడక్షన్‌ డిజైనర్‌గా పని చేస్తున్నారు. త్వరలో ఇతర నటీనటులు, టెక్నికల్‌ టీం వివరాలను వెల్లడిస్తారు.

Updated Date - 2023-03-03T15:52:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!