ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Indore: పర్సనల్ ప్రాబ్లం అని చెప్పి 2రోజులు ఇంట్లో ఉన్న బంధువుల అమ్మాయి.. మూడో రోజు లవర్ కోసం ఊహించని షాకిచ్చింది!

ABN, First Publish Date - 2023-01-25T11:25:32+05:30

బంధువుల అమ్మాయి.. పైగా పర్సనల్ ప్రాబ్లం (Personal Problem) అని, ఓ రెండు రోజులు మీ ఇంట్లో ఉంటానని చెప్పింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇండోర్: బంధువుల అమ్మాయి.. పైగా పర్సనల్ ప్రాబ్లం (Personal Problem) అని, ఓ రెండు రోజులు మీ ఇంట్లో ఉంటానని చెప్పింది. దాంతో బంధువుల అమ్మాయేగా అని అవతలి వారు కూడా సరే అన్నారు. అలా రెండు రోజులు బంధువుల ఇంట్లో (Relatives House) ఉన్న ఆ యువతి మూడో రోజు తాను ప్రేమించినోడిని పెళ్లాడేందుకు (Marry Lover) చేసిన పని, ఆ తర్వాత ఆ ఇంట్లోవారికి ఊహించని షాక్ ఇచ్చింది. దాంతో వారు ఏకంగా పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాల్సి వచ్చింది. ఇంతకీ ఆ యువతి చేసిన పనేంటి? ఆమెపై ఆ బంధువులు పోలీస్ స్టేషన్ వరకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? తదితర విషయాలు తెలియాలంటే మనం ఈ స్టోరీ చదవాల్సిందే.

మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) ముల్తాన్‌కు చెందిన అంజలి అనే యువతి ఇండోర్‌లో (Indore) చదువుతుంది. అక్కడి నుంచి సమీపంలో ఉండే పరదేశిపూరలో (Paradeshipura) ఆమె దూరపు బంధువులు ఉంటారు. ఈ నెల 18న అంజలి వాళ్ల ఇంటికి వెళ్లింది. పర్సనల్ ప్లాబ్లం ఓ రెండు రెండు మీ ఇంట్లో ఉంటానని చెప్పింది. అందుకు ఆ ఇంట్లో వారు సరే అన్నారు. అలా రెండు రోజులు ఆమె ఆ బంధువుల ఇంట్లో ఉంది. మూడో రోజు ఇంట్లోవారు ఎవరి పనికి వారు బయటకు వెళ్లిపోయారు. దాంతో ఇంట్లో ఎవరు లేని సమయం చూసి అంజలి చేతివాటం చూపించింది. ఇంట్లోని లక్షన్నర నగదు, బంగారు నగలు తీసుకుని అక్కడి నుంచి ఉడాయించింది. పనులు ముగించుకుని సాయంత్రం ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులకు ఇంట్లో సామాన్లు చిందరవందరగా పడి ఉండటం కనిపించింది.

అదే సమయంలో ఇంట్లో అంజలి కూడా కనిపించలేదు. దాంతో అనుమానం వచ్చి నగదు, నగలు దాచిపెట్టిన బీరువాను తెరిచి చూశారు. అందులో నగలు, నగదు రెండూ కనిపించలేదు. వెంటనే అంజలికి ఫోన్ చేశారు. తనకు ప్రస్తుతం డబ్బు, నగలు చాలా అవసరం అని, త్వరలోనే మీకు తిరిగి ఇచ్చేస్తానని చెప్పింది. తాను ఓ యువకుడిని ప్రేమించానని, అతడిని పెళ్లాడేండుకు తనకు నగలు, నగదు అవసరమని చెప్పి ఫోన్ పెట్టేసింది. తిరిగి కాల్ చేస్తే స్వీచ్చాఫ్ వచ్చింది. దాంతో చేసేదేమిలేక కుటుంబ సభ్యులు అంజలిపై పరదేశిపూరలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు అంజలిపై దొంగతనం కేసు నమోదు చేసిన పోలీసులు, ఆమె కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Updated Date - 2023-01-25T11:26:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising