ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: అదృష్టం అంటే ఈమెదే! ఎలాంటి ప్రమాదం నుంచి బయటపడిందో చూస్తే దిమ్మతిరగాల్సిందే!

ABN, First Publish Date - 2023-11-12T18:52:59+05:30

క్రేన్ నుంచి వేలాడుతున్న ఊయల నుంచి కిందపడిపోవాల్సిన ఓ యువతి భారీ ప్రమాదం నుంచి బయటపడ్డ తీరు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఇంటర్నెట్ డెస్క్: చావు బతుకుల మధ్య తేడా అదృష్టం మాత్రమే! టైం బాగుంటే ఇంటికి లేకపోతే కాటికి పోవాల్సిందే! నెట్టింట ఓ భయానక వీడియో చూసి జనాలు ఇప్పుడు ఇదే కామెంట్స్ చేస్తు్న్నారు. ప్రాణాపాయం నుంచి ఓ యువతి బయటపడిన తీరు చూసి ఆశ్చర్యపోతున్నారు. ఆమె నిజంగా లక్కీ లేకపోతే, జీవితం తెల్లారిపోయేదే అంటూ వణికిపోతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా(Viral Video) మారింది.

ఘటన ఎక్కడ జరిగిందో తెలీదు కానీ ఓ మేళాలో ఇద్దరు యువతులు ఊయలు ఊగడం ప్రారంభించారు. అది క్రేన్ ద్వారా వేళాడదీసిన ఊయల చాలా ఎత్తున ఏర్పాటు చేశారు. అందులో ఇద్దరే కూర్చునేందుకు చోటుంది. భారీ ఊయలలో ఊగుతూ థ్రిల్ ఫీలవుదామనుకున్న ఇద్దరు యువతులు రంగంలోకి దిగారు. కానీ, ప్రమాదం ఎక్కడి నుంచి వస్తుందో ఎవరం చెప్పలేం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని సార్లు అవాంఛనీయ ఘటనలు జరుగుతాయి(Girl luckily escapes from falling from a swing).


ఈ ఉదంతంలో కూడా సరిగ్గా అలాంటి పరిస్థితే దాపురించింది. ఊయల ఊగుతున్న ఓ యువతి సీటుకున్న తీగ అకస్మాత్తుగా తెగిపోవడంతో ఆమె కిందకు జారిపోయింది. అదృష్టవశాత్తూ ఆమె కాలు ఊయలకున్న రాడ్ల్ మధ్య ఇరుక్కుపోవడంతో ఆమె కిందపడలేదు. ఊయల కిందకు వచ్చేంతవరకూ ఆమె అలాగే తలకిందులుగా వేలాడుతూ ఉండిపోవాల్సి వచ్చింది. శరీరం బరువంతా ఓ కాలుపై పడటంతో ఆమె తీవ్ర వేదన అనుభవించింది. ఈ దృశ్యాన్ని చూసి స్థానికులు పెద్దపెట్టున కేకలు పెట్టారు. ఆ తరువాత ఊయలను కిందకు దింపడంతో యువతి ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయటపడింది. ఈ షాకింగ్ సన్నివేశం చూసి నెటిజన్లు కూడా దడుసుకుంటున్నారు.

Updated Date - 2023-11-12T18:56:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising