Flyover: నేపియర్ వంతెన నుంచి కోయంబేడుకు రెండంతస్తుల ఫ్లైఓవర్
ABN, First Publish Date - 2023-10-04T11:52:07+05:30
నగరంలో ట్రాఫిక్ రద్దీ నియంత్రణ, హార్బర్‌కు కంటైనర్ లారీలు ట్రాఫిక్ రద్దీ లేకుండా వెళ్లేలా 2009లో మదురవాయల్ - హార్బర్ ఫ్లై ఓవర్‌కు
- త్వరలో పనులు ప్రారంభం
పెరంబూర్(చెన్నై): నగరంలో ట్రాఫిక్ రద్దీ నియంత్రణ, హార్బర్‌కు కంటైనర్ లారీలు ట్రాఫిక్ రద్దీ లేకుండా వెళ్లేలా 2009లో మదురవాయల్ - హార్బర్ ఫ్లై ఓవర్‌కు శంకుస్థాపన జరిగింది. కానీ, పలు కారణాలతో ఈ ప్రాజెక్ట్ అమలలో జాప్యం జరిగింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ను సీఎం స్టాలిన్(CM Stalin) సమీక్షించి, ఈ ప్రాజెక్ట్ రెండు అంతస్తులతో ఫ్లై ఓవర్‌గా మార్పు చేశారు. ఇందుకోసం రాష్ట్రప్రభుత్వం, జాతీయ రహదారుల కమిషన్, చెన్నై హార్బర్ సంస్థ, జాతీయ నావికాదళం ఒప్పందం కుదుర్చు కున్నాయి. ఈ ప్రకారం, 20.56 కి.మీ దూరానికి రూ.5,855 కోట్లతో రెండు అంతస్తుల ఫ్లై ఓవర్ నిర్మాణానికి గత ఏడాది మే 26న ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్ట్ పనులను నాలుగు దశలుగా విభజించి టెండర్లు ఆహ్వానించగా, ముంబైకి చెందిన సంస్థ టెండరు చేజిక్కించుకుంది. ఈ 20.56 కి.మీ దూరంలో 12.5 కి.మీ దూరానికి నేపియర్ వంతెన నుంచి కోయంబేడు(Koyambedu) వరకు కూవం నదిపై రెండు అంతస్తుల ఫ్లై ఓవర్ ఏర్పాటుకానుంది. అందులో 7 ప్రవేశద్వారాలు, 6 నిష్క్రమణ ద్వారాలు ఉంటాయి. ఈ ప్రాజెక్టు రెండేళ్లలో ముగించాలని నిర్ణయించగా, అక్టోబరులో నిర్మాణపనులు ప్రారంభం కానున్నాయి. ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే చెన్నైలో ట్రాఫిక్ రద్దీ నియంత్రించవచ్చని అధికారులు చెబుతున్నారు.
Updated Date - 2023-10-04T11:52:07+05:30 IST