Shocking: అందరూ కలిసి ఆరు బయట భోజనం చేస్తున్నారు.. నిమిషంలో ఇల్లు మాయం.. అసలేం జరిగిందంటే..
ABN, First Publish Date - 2023-03-05T16:36:29+05:30
ఆ కుటుంబ సభ్యులందరూ కలిసి శనివారం రాత్రి ఆరు బయట భోజనాలు చేస్తున్నారు.. అంతలో ఉన్నట్టుండి ఉరుములు, మెరుపులు మొదలయ్యాయి.. అందరూ ఇంట్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.. ఇంతలో..
ఆ కుటుంబ సభ్యులందరూ కలిసి శనివారం రాత్రి ఆరు బయట భోజనాలు చేస్తున్నారు.. అంతలో ఉన్నట్టుండి ఉరుములు, మెరుపులు మొదలయ్యాయి.. అందరూ ఇంట్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.. ఇంతలో పెద్ద పిడుగు పడి ఇల్లు మొత్తం కూలిపోయింది.. అందరూ బయట ఉండడంతో ప్రాణ నష్టం జరగలేదు.. కానీ, కళ్ల ముందే ఇల్లు కూలిపోవడంతో కుటంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు (Shocking Incident).
రాజస్థాన్‌లోని (Rajasthan) అజ్మీర్ జిల్లా రాంపుర గ్రామంలో ఆదివారం రాత్రి పిడుగుపాటుకు (Lightning) మదన్ సింగ్ అనే వ్యక్తి ఇల్లు కూలిపోయింది (House collapsed). ప్రమాదం జరిగిన సమయంలో కుటుంబ సభ్యులంతా ఇంటి బయట కూర్చొని భోజనం చేస్తున్నారు. దీంతో అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. కాగా, ఆ పిడుగుపాటుకు ఇంటి వరండాలో ఉన్న రెండు గేదెలు మృత్యువాత పడ్డాయి. ప్రమాదంపై గ్రామ సర్పంచ్ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు బాధితులకు తగిన పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు.
Updated Date - 2023-03-05T16:36:29+05:30 IST