ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bumper Offer: ఇలాంటి ఆఫర్‌ను ఎప్పుడూ విని ఉండరు.. అక్కడ నివసిస్తామంటే చాలు.. ఏకంగా రూ.70 లక్షలు ఇస్తారట..!

ABN, First Publish Date - 2023-06-17T17:58:07+05:30

చుట్టూ కొండలు, సెలయేళ్లు, పచ్చని ప్రకృతి మధ్య జీవించడం ఎవరికీ ఇష్టం ఉండదు. అలాంటి ప్రాంతాలకు వెళ్లేందుకు లక్షల రూపాయలు ఖర్చు పెట్టే వాళ్లు కూడా ఉన్నారు. అలాంటి ప్రకృతి ప్రేమికుల కోసం ఐర్లాండ్ ప్రభుత్వం బంపరాఫర్ ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చుట్టూ కొండలు, సెలయేళ్లు, పచ్చని ప్రకృతి మధ్య జీవించడం ఎవరికీ ఇష్టం ఉండదు. అలాంటి ప్రాంతాలకు వెళ్లేందుకు లక్షల రూపాయలు ఖర్చు పెట్టే వాళ్లు కూడా ఉన్నారు. అలాంటి ప్రకృతి ప్రేమికుల కోసం ఐర్లాండ్ (Ireland) ప్రభుత్వం బంపరాఫర్ ప్రకటించింది. తమ దేశంలో ఉండే ఐలాండ్‌ (Islands)ల్లో నివసించేవారికి ఏకంగా రూ.70 లక్షలు ఇస్తామని ప్రకటించింది. వినడానికి కాస్త వింతగా ఉన్నా ఇది నిజం. ఐర్లాండ్ ప్రభుత్వం (Ireland Government) దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని దీవుల్లో స్థిరపడాలనుకుంటున్న వారి కోసం ఒక విధానాన్ని రూపొందించింది.

గత కొన్నేళ్లుగా ఐర్లాండ్‌లోని పల్లె వాసులు నగరాలకు తరలి వెళ్లిపోతున్నారు. దీంతో ఐర్లాండ్ గ్రామీణ జనాభా గణనీయంగా తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో ఐర్లాండ్ ప్రభుత్వం ``అవర్ లివింగ్ ఐలాండ్స్ పాలసీ`` (Our Living Islands Policy)ని రూపొందించింది. ఐర్లాండ్ మారుమూల ప్రాంతాల్లో ఉన్న దీవుల్లో నివసించడానికి సిద్ధపడే వారికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకంగా రూ.70 లక్షలు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఇందుకోసం ఐరిష్ ప్రభుత్వం మొత్తం 23 దీవులను ఎంపిక చేసింది. ఆయా ద్వీపాల్లో ఇల్లు కట్టుకుని నివసించే వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. అయితే రూ.70 లక్షలు రావాలంటే కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి.

Viral Video: కంగారూ దాడి నుంచి ఓ మహిళను కాపాడాడు.. తాను మాత్రం దొరికిపోయాడు.. వైరల్ అవుతున్న వీడియో!

ఆయా దీవుల్లో స్థిరపడాలనుకుంటున్న వారు ఆ ప్రాంతంలో 1993కి ముందు నిర్మించిన ఏదైనా ఇంటిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే డబ్బును ఇంటి పునరుద్ధరణకు మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. అయితే, ఈ ఆఫర్ విదేశీయులకు వర్తించదు. ఐర్లాండ్ మాత్రమే కాదు.. స్పెయిన్, మారిషస్, గ్రీస్, క్రొయేషియా, ఇటలీ, చిలీ వంటి దేశాలు కూడా ఇప్పటికే ఇటువంటి ఆఫర్లను ప్రకటించాయి.

Updated Date - 2023-06-17T17:58:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising