ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Shocking Fact: గాజు గ్లాసులోనే మద్యం ఎందుకు తాగుతారు? స్టీల్ గ్లాసులు వాడితే ప్రమాదకరమా?

ABN, First Publish Date - 2023-03-25T21:26:29+05:30

ప్రపంచంలో చాలా మంది మద్యం తాగేటపుడు గాజు గ్లాసులనే వాడతారు. ఇంట్లో రోజూ ఉపయోగించే స్టీల్ గ్లాసులను మద్యం సేవించేటపుడు ఉపయోగించరు. స్టీల్ గ్లాసులో మద్యం తాగడం ఆరోగ్యం మీద చెడు ప్రభావం చూపుతుందని చాలా మంది భావిస్తుంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ప్రపంచంలో చాలా మంది మద్యం తాగేటపుడు గాజు గ్లాసులనే వాడతారు. ఇంట్లో రోజూ ఉపయోగించే స్టీల్ గ్లాసులను (Wine in Steel glass) మద్యం సేవించేటపుడు ఉపయోగించరు. స్టీల్ గ్లాసులో మద్యం తాగడం మంచిది కాదని, ఆరోగ్యం మీద చెడు ప్రభావం చూపుతుందని చాలా మంది భావిస్తుంటారు. గాజు గ్లాసు అయితే ఎటువంటి ప్రమాదం ఉండదని నమ్ముతుంటారు. ఈ నమ్మకం నిజమేనా? స్టీల్ గ్లాసులో మద్యం తాగితే ప్రమాదకరమా? నిపుణులు ఏమంటున్నారంటే.. (Viral News)

నిజానికి మద్యం (Alcohol) తాగడమే ఆరోగ్యానికి హానికరం. అది ఏ గ్లాసులో వేసుకుని తాగినా ప్రమాదమే. గ్లాసును బట్టి మద్యం దుష్ఫరిణామాల విషయంలో తేడా ఉండదు. స్టీల్ గ్లాసులో మద్యం తాగడం వల్ల ఎక్కువ హాని కలగడమనేది ఉండదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నిజానికి మద్యాన్ని పులియబెట్టే ట్యాంక్‌ల నుంచి ఫిల్టరింగ్‌ పరికరాల వరకు ప్రతిదానిని స్టీల్‌తోనే తయారు చేస్తారు. స్టీల్‌ గ్లాసులో మద్యం పోయడం వల్ల దాని రసాయన స్వభావం గానీ, లేదంటే మద్యం రుచి గానీ మారదు. స్టీల్ గ్లాసులలో మద్యం తాగడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదకరం అనేది అపోహ మాత్రమేనట. అయితే చాలా మంది గాజు గ్లాసులనే వాడడానికి ఓ కారణముందట.

Viral: తన భర్తకు మరో యువతిని గిఫ్ట్‌గా ఇచ్చిన భార్య.. ఇదంతా ఆమె ఎందుకు చేసిందో తెలిస్తే షాకవక తప్పదు..

గతంలో ఖరీదుగా ఉండే వైన్‌ను అప్పటి ధనవంతులు గ్లాజు గ్లాసులో వేసుకుని తాగి తమ దర్పాన్ని ప్రదర్శించేవారట. అప్పట్నుంచి ఆ ట్రెండ్ కొనసాగుతూ వస్తోందట. పైగా మందు బాబులను ఆకట్టుకునేలా రకరకాల డిజైన్లలో గ్లాజు గ్లాసులను తయారు చేయవచ్చు. స్టీల్ గ్లాసులతో ఆ సౌలభ్యం ఉండదు. అలాగే గాజు గ్లాసులో మద్యం పోస్తే దాని రంగు పూర్తిగా బయటకు కనబడుతుంది. అందువల్లే చాలా మందికి మద్యం సేవించేటపుడు గ్లాజు గ్లాసులను ఉపయోగిస్తేనే తప్ప కిక్ రాదట. అంతే తప్ప వేరే కారణం లేదట. నిజానికి, చాలా మంది బయట మద్యం తాగేవారు ప్లాస్టిక్ గ్లాసులను కూడా వాడేస్తుంటారు.

Viral: పెళ్లి తర్వాత ఆ పని చేయలేనని చెప్పిన యువకుడు.. ఏకంగా పెళ్లే రద్దు చేసుకున్న యువతి.. అసలు కథేంటంటే..

Updated Date - 2023-03-25T21:26:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising