ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Telegram లో సినిమాలు డౌన్‌లోడ్ చేస్తుంటారా..? ఫోన్లో సినిమా చూస్తూ ఓ వ్యక్తి రూ.3.15 లక్షలు ఎలా పోగొట్టుకున్నాడంటే..

ABN, First Publish Date - 2023-01-02T18:33:54+05:30

ఎలాంటి ఓటిపి కానీ, ఏ విధమైన మెసేజ్ కానీ రాకుండా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డిసెంబర్ 20తేదీ జైపూర్ కు చెందిన ఒక ప్రొఫెసర్ తన ఎఫ్.డి డబ్బు 3.15 లక్షలు బ్యాంకులో వేసుకున్నాడు. అయితే ఒకటి రెండురోజులలో అతని బ్యాంకు అకౌంట్ ఖాళీ అయిపోయింది. బ్యాంక్ లో డబ్బు మాయమైపోయినప్పుడు ఎలాంటి ఓటిపి కానీ, ఏ విధమైన మెసేజ్ కానీ రాకపోవడం గమనార్హం. అతను నిర్ఘాంతపోయి పోలీసులను ఆశ్రయించగా కేవలం లింక్ సహాయంతో సినిమాలు డౌన్లోడ్ చేసుకుని చూడటం వల్ల బ్యాంకులో డబ్బు కోల్పోతున్నారని, ఇది సైబర్ నేరగాళ్ళ కొత్త వ్యూహమని తెలిసింది. సైబర్ క్రైమ్ ప్రపంచంలో ఈ తరహా మోసాన్ని బ్యాంకింగ్ ట్రోజన్స్ అని అంటారు. అసలు ఇలాంటి మోసాలు ఎలా జరుగుతాయి? వీటిని పోలీసులు కూడా ఎందుకు అరికట్టలేకపోతున్నారు అంటే..

సైబర్ నేరగాళ్ళ కొత్త వ్యూహం ఈ బ్యాంకింగ్ ట్రోజన్స్. సాధారణంగా టెలిగ్రామ్ లో కొత్త సినిమాలకోసం ఏవేవో గ్రూపుల్లో చేరి సినిమాలను డౌన్లోడ్ చేసుకుని చూస్తుంటారు. అయితే మొదట సాధారణంగా డౌన్లోడ్ ఆప్షన్ ఇచ్చి ఆ తరువాత నేరుగా డౌన్లోడ్ చేయకుండా లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోమని లింక్స్ పెడుతుంటారు కొన్ని గ్రూపులలో. ఇలాంటి సమయాలలో లింక్ ను టచ్ చేసి సినిమా డౌన్లోడ్ చేసుకునేటపుడు ఆ లింక్ లో సైబర్ నేరగాళ్ళు అటాచ్ చేసిన వైరస్ సినిమా డౌన్లోడ్ చేసుకున్న వారి మొబైల్ ను ఆక్రమిస్తుంది. దీని వల్ల మొబైల్ లో డేటాతో పాటు మొత్తం మొబైల్ ఆపరేటింగ్ అంతా సైబర్ నేరగాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. కనీసం మొబైల్ కు ఎలాంటి మెసేజ్, ఏ విధమైన ఓటిపి రాకుండా డబ్బు డ్రా చేసుకుంటారు. గత సంవత్సరంలో 50వేల మంది ప్రజలు, 95కోట్ల రూపాయలను ఈ బ్యాంకింగ్ ట్రోజన్ వల్ల కోల్పోయారు. ఈ మొత్తం ప్రక్రియకు మాల్వేర్ అనే వైరస్ ఏ మూలకారణమవుతోంది.

ఈ వైరస్ ను ఎలా కనుగొనచ్చంటే..

ఏదైనా లింక్ టచ్ చేసి డౌన్లోడ్ చేసినపుడు వైరస్ మొబైల్ కు చేరగానే మొబైల్ పనితీరు మారిపోతుంది. ఉన్నట్టుండి ఫోన్ హ్యాంగ్ అవ్వడం, అప్లికేషన్ల పనితీరులో మార్పు, మొబైల్ కంట్రోల్ తప్పడం వంటివి జరుగుతాయి.

దీన్ని ఎలా నివారించాలంటే..

మొబైల్ లో ప్రభుత్వం రూపొందించిన ఇ-స్కాన్ ను ఇన్స్టాల్ చేసుకోవాలి. దీనివల్ల మొబైల్ లో ఏది డౌన్లోడ్ అయినా స్కానింగ్ ద్వారా మొబైల్ సురక్షితంగా ఉంటుంది. అలాగే తెలియని లింక్ లను టచ్ చేయకూడదు. మొబైల్ ను డవలపర్ మోడ్ లో ఉంచుకోకూడదు. థర్డ్ పార్టీ అప్లికేషన్లు డౌన్లోడ్ అయ్యేవిధానాన్నిక్లోజ్ చెయ్యాలి.

పైరేట్ సాప్ట్వేర్ లు, పైరేట్ మూవీస్, పైరేట్ అప్లికషన్లను డౌన్లోడ్ చెయ్యడం మానెయ్యాలి.

బ్యాంకింక్ ట్రోజన్ పద్దతిలో ఎవరైనా డబ్బు పోగొట్టుకున్నట్టయితే 24 గంటలలో 1930 హెల్ప్ లైన్ నెంబర్ కు ఫోన్ చెయ్యాలి. వారు బాదితుల అకౌంట్స్ నుండి డబ్బు ట్రాన్స్ఫర్ కాకుండా అకౌంట్ ను స్థంబిపచేస్తారు. అయితే ఈ తరహా మోసాల్లో కూడా కేవలం 10శాతం అకౌంట్లను మాత్రమే స్థంబింపచేయగలుగుతున్నారు. 80శాతం మోసాలన్ని పైరేట్ సాఫ్ట్వేర్ ద్వారా ప్రజలు చేసుకుంటున్న స్వీయ తప్పిదాల వల్ల జరుగుతున్నవని తెలుస్తోంది. ఏది ఏమైనా కొత్త సినిమా మోజు కాస్తా బ్యాంకు ఖాతాలు ఖాళీ చెయ్యకుండా చూసుకోవాలంటే తొందరపాటులో లింక్స్ టచ్ చేయకండి.

Updated Date - 2023-01-02T18:34:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising