ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nandamuri Family: ఎన్టీఆర్‌ని ఇంకా దూరంగానే ఉంచారా? వీడియో వైరల్‌!

ABN, First Publish Date - 2023-03-03T16:45:01+05:30

హీరో తారకరత్న మరణం నందమూరి కుటుంబం, అభిమానునుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన భార్య అలేఖ్య రెడ్డి భర్తను గుర్తు చేసుకుని కన్నీరుమున్నీరవుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హీరో తారకరత్న (Tarakaratna DasaDina karma) మరణం నందమూరి కుటుంబం, అభిమానునుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన భార్య అలేఖ్య రెడ్డి (Alekhya reddy) భర్తను గుర్తు చేసుకుని కన్నీరుమున్నీరవుతున్నారు. తరచూ ఆయన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. ఆ పోస్ట్‌లు చూసిన అభిమానులు కన్నీటి పర్యాంతమవుతున్నారు. గురువారం తారకరత్న పెద్దకర్మ ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ సెంటర్లో జరిగింది. నందమూరి బాలకృష్ణ (NBK)అన్ని కార్యక్రమాలను ముందుండి నడిపించారు. ఈ కార్యక్రమానికి నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు, టీడీపీ నాయకులు భారీ ఎత్తున హాజరయ్యారు. దీనికి సంబంధించి కొన్ని వీడియోలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ వీడియోలను చూసిన చాలామంది జూనియర్‌ ఎన్టీఆర్‌ను బాలయ్య దూరం పెట్టినట్లుగా ఉందీ అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

అసలు ఏం జరిగిందంటే... తారకరత్న పెద్ద కార్యక్రమానికి హాజరైన నందమూరి కుటుంబ సభ్యులంతా ఓ చోట కూర్చుని ఉండగా బాలయ్య అందరినీ పలకరించారు. పక్కనే కూర్చుని ఉన్న కల్యాణ్‌, తారక్‌లు బాబాయ్‌ని చూడగానే లేచి నిలబడ్డారు. అయితే బాలయ్య ఎన్టీఆర్‌ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. (Balakrishna avoiding NTR) ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. అభిమానులు ఇంకా తారక్‌ని దూరంగానే పెట్టారా అని కొందరు, మరోసారి తారక్‌ను అవమానించారు అంటూ నెట్టింట అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-03-03T18:33:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!