ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral News: అనుకోకుండా పూల కుండి పగలగొట్టిన డెలివరీ బాయ్..తర్వాత అతను చేసిన పనికి అందరూ..

ABN, First Publish Date - 2023-06-02T16:26:15+05:30

హృదయాలను కదిలించే ఓ డెలివరీమాన్(Delivery Man) హార్ట్ టచ్చింగ్ స్టోరీ ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: హృదయాలను కదిలించే ఓ డెలివరీమాన్(Delivery Man) హార్ట్ టచ్చింగ్ స్టోరీ ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఓ జంటకు ఫుడ్ ఆర్డర్ డెలివరీ ఇచ్చేందుకు వారి ఫ్లాట్‌కు వెల్లిన డెలివరీ మ్యాన్ అక్కడ అనుకోకుండా ఓ పూలకుండీ(Flowers Pot)ని పగలగొట్టాడు. ఆ తర్వాత ఇంటి యజమానికి క్షమాపణలు చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత మూడు రోజులకు అతడు చేసిన పని అందరిని ఆశ్చర్యపర్చింది.

మే 28న ఎలీ మెక్ కాన్(Eli McCann) అనే మహిళ ఈ పోస్ట్‌ను షేర్ చేసింది. ఆమె భర్త రాత్రి ఫుడ్ కోసం ఆర్డరు చేయగా ఫుడ్ పార్శిల్ ఇచ్చేందుకు ఇంట్లోకి వచ్చిన డెలివరీ బోయ్ అనుకోకుండా పూల కుండీని పగలగొట్టాడు. అయితే పూల కుండి విషయంలో నాకు, నా భర్తకు డెలివరీ బోయ్ క్షమాపణలు కూడా చెప్పాడు’’ అని చెప్పింది మెక్ కాన్. తన భర్త కూడా పర్వాలేదులే ఇలాంటి అనుకోకుండా జరుగుతాయి అని డెలీవరీ బోయ్‌ని పంపించాడని’’ మెక్ కాన్ తెలిపింది.

అయితే మూడు రోజుల తర్వాత ఆ డెలివరీ బోయ్ చేసిన పనికి మెక్ కాన్‌తో పాటు ఆమె భర్త కూడా ఆశ్చర్యపోయాడు. మూడో రోజు మెక్‌కాన్ ఇంటి ముందు పూలకుండి ప్రత్యక్షమయింది. అంతేకాదు దానితోపాటు ఓ లెటర్ కూడా ఉంచాడు డెలివరీ మ్యాన్. ఇది చూసిన మెక్‌కాన్ దంపతులు సంతోషంతో ఒకింత ఆశ్చర్యపోయారు.

ఇంతకీ ఆ లెటర్‌లో ఏముందో తెలుసా? డెలివరీ బోయ్ ఆ లెటర్‌లో ఇలా రాశాడు ‘‘నేను మీ ఊబర్ డ్రైవర్‌ జోర్డాన్‌( Jordan)ను. గత ఆదివారం మీ ఇంట్లో అనుకోకుండా పూల కుండి పగలగొట్టాను. అది కేవలం పూల కుండియే కాదు. మీ సెంటిమెంట్ అని తెలుసుకున్నాను. దానికి బదులుగా మరో పూలకుండి ఉంచుతున్నాను. మీ దయగల హృదయానికి ధన్యావాదాలు’’ అంటూ రాశాడు.

అయితే డెలివరీ బోయ్ హృదయం కదిలించే ఘటనకు సంబంధించిన పోస్ట్‌షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు రెండు మిలియన్ల వ్యూస్, 33వేల లైకులు వచ్చాయంటే నెటిజన్ల ఈ పోస్ట్ ఎంతగా ఆకట్టుకుందో తెలుస్తోంది. జోర్డన్ ఒక దేవదూత అని ఓ నెటిజన్ రాశాడు. ‘‘నేను ఈ కథనాన్ని చాలా ఇష్టపడుతున్నాను. నిజంగా నా హృదయం సంతోషంతో నిండిపోయింది’’ అని మరో నెటిజన్ రాశాడు.

‘‘మరో నెటిజన్ ఇలా స్పందించాడు. ఇప్పుడా పూలకుండి చాలా ఫేమస్ అయింది. దానిని ప్రమాదకర పరిస్థితుల్లో ఉంచకండి ’’ అంటూ ట్వాట్ చేశాడు. ‘‘పూలకుండి సెంటిమెంట్ వస్తువు అయినప్పటికీ వారు డెలివరీ బాయ్‌ని క్షమించాడం ఇది ఒక అందమైన, ఆలోచించదగ్గ విషయం. మెక్ కామ్ దంపతులు చాలా మంచివారు’’ అని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.

Updated Date - 2023-06-02T17:08:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising