Shcocking: స్టేషన్‌కు వచ్చి ఏడుస్తున్న 39 ఏళ్ల మహిళ.. పక్కనే ఓ సూట్‌కేస్.. ఏమైందో అర్థం కాక దాన్ని ఓపెన్ చేసి చూసిన పోలీసులకు..!
ABN, First Publish Date - 2023-06-13T16:44:56+05:30
భారత ఐటీ హబ్ బెంగళూరులో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. సోమవారం సాయంత్రం ఓ 39 ఏళ్ల మహిళ ఓ సూట్‌కేసుతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది.. విషయం ఏమీ చెప్పకుండా అక్కడ కూర్చుని ఏడుపు ప్రారంభించింది.. కంగారు పడిన పోలీసులు ఆమెను మాట్లాడించేందుకు ప్రయత్నించారు..
భారత ఐటీ హబ్ బెంగళూరు (Bengaluru)లో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. సోమవారం సాయంత్రం ఓ 39 ఏళ్ల మహిళ ఓ సూట్‌కేసుతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది.. విషయం ఏమీ చెప్పకుండా అక్కడ కూర్చుని ఏడుపు ప్రారంభించింది.. కంగారు పడిన పోలీసులు ఆమెను మాట్లాడించేందుకు ప్రయత్నించారు.. ఆమె చెప్పింది విన్న పోలీసులు పక్కనే ఉన్న సూట్‌కేస్ (Suitcase) తెరిచి చూశారు.. లోపల ఏం ఉందో చూసి నివ్వెరపోయారు. ఆ సూట్‌కేస్‌లో ఆ మహిళ తల్లి మృతదేహం ఉంది (Crime News).
కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఓ అపార్ట్‌మెంట్‌లో సోనాలీ సేన్ అనే బెంగాలీ మహిళ తన భర్త, అత్తగారు, తల్లితో కలిసి నివసిస్తోంది. ఆమె బెంగళూరులో ఫిజియోథెరపిస్ట్‌గా పని చేస్తోంది. సోమవారం ఆమె సూట్‌కేస్‌తో సహా మైకో లే-అవుట్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. అందులో తన తల్లి మృతదేహం ఉందని పోలీసులకు తెలిపాడు. తన తల్లిని తానే చంపేశానని చెప్పడంతో పోలీసులు షాకయ్యారు. వెంటనే సోనాలీని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు (Daughter kills mother).
Snake With Four Legs: ఇదేం వింత బాబోయ్.. పాముకు కాళ్లు ఉండటాన్ని మీరెక్కడైనా చూశారా..? అసలు ఇది పామేనా..?
తన తల్లి ప్రతిరోజూ ఏదో విషయమై ఇంట్లో వారితోనూ, చుట్టు పక్కల వారితోనూ గొడవకు దిగేదని, ప్రతిరోజూ తనకు తల్లి మీద ఫిర్యాదులు రావడం ఇబ్బంది కలిగించిందని చెప్పింది. ఆ సమస్యల నుంచి తప్పించుకునేందుకు క్షణికావేశంలో తల్లిని చంపేశానని తెలిపింది. తాను ఆమెను చంపినపుడు ఎవరూ లేరని చెప్పింది. భర్త డ్యూటీలో ఉండగా, అత్తగారు వేరే గదిలో నిద్రపోతోందని చెప్పింది. పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.
Updated Date - 2023-06-13T16:44:56+05:30 IST