ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: చూస్తే నవ్వు ఆపుకోలేరు.. సైనికులు పరేడ్ చేస్తుంటే.. కోడి ఏం చేసిందంటే..

ABN, First Publish Date - 2023-01-05T15:56:44+05:30

ఇంటర్నెట్, సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ కోడికి సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. అది చూసి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఇంటర్నెట్, సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ కోడికి సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. అది చూసి నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. సైనికులు కవాతు చేస్తుండగా.. పక్కనే కోడి చేసిన పని చూసి రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు కోడి ఏం చేసింది.. నెటిజన్లు ఎందుకు అంతలా రియాక్ట్ అవుతున్నారు? అనే విషయాలు తెలియాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..

సైనికులు రోజూవారీ కార్యక్రమాల్లో భాగంగా కవాతు కూడా చేస్తుంటారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. కొందరు సైనికులు ఉదయాన్నే పరేడ్ చేసేందుకు సిద్ధం అయ్యారు. అనంతరం ఉన్నతాధికారుల సూచనల ప్రకారం జవాన్లు కవాతు ప్రారంభిస్తారు. ఇదే సమయంలో అక్కడే ఉన్న ఓ కోడి కూడా.. సైనికులతో పోటీపడి మరీ కవాతు చేసింది. దీంతో అక్కడున్న వాళ్లు కోడి పరేడ్ చేయడాన్ని చూసి షాకయ్యారు. అందుకు సంబంధించిన దృశ్యాలను వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు చోటు చేసుకుందనే వివరాలు అందుబాటులో లేవు కానీ అందుకు సంబంధించిన వీడియో మాత్రం నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు ఆ వీడియో చూసి కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ‘పూర్వ జన్మలో ఆ కోడి జవాన్ అయి ఉంటుంది. అందుకే సైనికులతో పోటీ పడుతూ మరీ కావాతు చేస్తోంది’ అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

Updated Date - 2023-01-05T16:00:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising