ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chennai-Sri Lanka: చెన్నై-శ్రీలంక మధ్య 5 నుంచి పర్యాటక నౌక

ABN, First Publish Date - 2023-05-21T10:48:28+05:30

స్థానిక హార్బర్‌ నుంచి శ్రీలంక(Sri Lanka)కు జూన్‌ 5వ తేది నుంచి పర్యాటక నౌక సేవలు అందుబాటులోకి రానున్నాయి. కేంద్రప్రభుత్వం ‘సాగర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌(చెన్నై): స్థానిక హార్బర్‌ నుంచి శ్రీలంక(Sri Lanka)కు జూన్‌ 5వ తేది నుంచి పర్యాటక నౌక సేవలు అందుబాటులోకి రానున్నాయి. కేంద్రప్రభుత్వం ‘సాగర్‌మాల’ పథకం కింద జల రవాణా అబివృద్ధికి చర్యలు చేపట్టింది. అందులో భాగంగా రాష్ట్రం నుంచి మరో రాష్ట్రం, దేశం నుంచి మరో దేశానికి పర్యాటక నౌకలు నడిపేందుకు ప్రైవేటు సంస్థలకు అనుమతిచ్చింది. ఈ మేరకు చెన్నై హార్బర్‌ నుంచి శ్రీలంకు పర్యాటక నౌక నడిపేందుకు కార్డిలియా అనే సంస్థకు అనుమంతిచంగా, ఆ సంస్థ అధునాతన వసతులతో కూడి ‘ఎమ్‌ప్రెస్‌’ అనే నౌకను నడపనుంది. వచ్చే నెల 5వ తేది బయల్దేరే నౌకా విహారంలో హంబన్‌టోట, ట్రింకోమలీ, కాంగేశం డిపార్ట్‌మెంట్‌, జాఫ్నా, కొలంబో నగరాలను సందర్శింవచ్చు. మూడు రోజుల ప్యాకేజీలో దంపతులకు రూ.86 వేలు ఛార్జీగా నిర్ణయించారు. చెన్నై(Chennai) నుంచి 24 గంటల్లో శ్రీలంకకు చేరుకొని, అక్కడి నుంచి ప్రధాన నగరాలకు వెళ్లనుంది. చెన్నై హార్బర్‌లోని 7వ ప్రవేశ ద్వారం గుండా ప్రయాణికులను అనుమతించనున్నారు. ఈ నౌకలో 1,600 మంది ప్రయాణం చేసే సామర్థ్యం కలిగింది. అలాగే, చెన్నై నుంచి కొచ్చిన్‌, ముంబై నగరాలకు ప్యాసింజర్‌ నౌకలు త్వరలో నడుపనున్నట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2023-05-21T10:48:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising