ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chennai: ఈ బాలుడు మామూలోడు కాదు.. అతడు చేసిన ఘనకార్యమేంటో తెలిస్తే...

ABN, First Publish Date - 2023-07-21T12:12:28+05:30

తేని ప్రాంతానికి చెందిన నీతిరాజన్‌ కుమారుడు స్నేహన్‌ (15) ఇంగ్లాండ్‌లోని ఇంగ్లీష్‌ కెనాల్‌లో 72 కిలోమీటర్లు ఈది రికార్డు నెలకొల్పి భారత

- ఇంగ్లీష్‌ కెనాల్‌లో ఈదిన తేని బాలుడు

ప్యారీస్‌(చెన్నై): తేని ప్రాంతానికి చెందిన నీతిరాజన్‌ కుమారుడు స్నేహన్‌ (15) ఇంగ్లాండ్‌లోని ఇంగ్లీష్‌ కెనాల్‌లో 72 కిలోమీటర్లు ఈది రికార్డు నెలకొల్పి భారతదేశానికి ఘనత చేకూర్చారు. తేని జిల్లా తమిళనాడు స్పోర్ట్స్‌ డెవలప్‏మెంట్‌ అథారిటీ స్విమ్మింగ్‌ఫూల్‌లో 2015 నుంచి స్విమ్మింగ్‌ కోచ్‌ విజయకుమార్‌ వద్ద స్నేహన్‌తో సహా పలువురు విద్యార్థులు శిక్షణ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, కోచ్‌ విజయకుమార్‌ నేతృత్వంలో స్నేహన్‌ సహా ఆరుగురు స్మిమ్మర్లు ఇంగ్లాండ్‌ వెళ్లారు. అక్కడ హో బీచ్‌ నుంచి ఫ్రాన్స్‌ వరకు ఉన్న ఇంగ్లీష్‌ కెనాల్‌లో 72 కి.మీ ఈది సరికొత్త రికార్డు నెలకొల్పారు. స్నేహన్‌ బృందం స్విమ్మింగ్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన భారత బృందమని గ్లోబల్‌ సంస్థ ప్రశంసించింది. స్విమ్మింగ్‌ కోచ్‌ విజయకుమార్‌తో పాటు స్నేహన్‌ తదితరులకు ప్రశంసాపత్రాలు అందచేసింది. స్నేహన్‌ గత సంవత్సరం మార్చి 28న రామనాధపురం జిల్లా ధనుష్కోటి నుంచి శ్రీలంకలోని తలైమన్నార్‌ వరకు, మళ్లీ అక్కడి నుంచి ధనుష్కోటి వరకు ఉన్న పాక్‌ జలసంధి ప్రాంతంలో 56 కి.మీ దూరం ఈదుకుంటూ రికార్డు నెలకొల్పారు.

Updated Date - 2023-07-21T12:13:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising