ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chennai: శివలింగాన్ని చుట్టిన కొండచిలువ

ABN, First Publish Date - 2023-07-05T10:49:59+05:30

తిరుప్పూరు జిల్లా తారాపురం కోట్టైమేడు వీధిలో మూతపడిన ప్రాచీన ఆలయంలోని శివలింగానికి ఓ కొండచిలువ నెమ్మదిగా ప్రదక్షిణ చేయడంతో స్థా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- పరవశించిన భక్తులు

చెన్నై, (ఆంధ్రజ్యోతి): తిరుప్పూరు జిల్లా తారాపురం కోట్టైమేడు వీధిలో మూతపడిన ప్రాచీన ఆలయంలోని శివలింగానికి ఓ కొండచిలువ నెమ్మదిగా ప్రదక్షిణ చేయడంతో స్థానిక భక్తులు గమనించి పారవశ్యం చెందారు. తారాపురంలో 500 యేళ్లనాటి విశ్వేశర ఆలయం శిథిలస్థితిలో ఉంది. ఆ ఆలయాన్ని కొన్నేళ్లకు ముందు మూసివేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం ఆ ఆలయంలోకి కొండచిలువ ప్రవేశించడాన్ని స్థానికులు గమనించారు. వెంటనే వెళ్ళి చూసినప్పుడు ఆ కొండచిలువ శివలింగాన్ని నెమ్మదిగా వలాయకారంలో ప్రదక్షిణ చేయడం కనిపించింది. ఆ దృశ్యాన్ని చూసి స్థానికులు పారవశ్యం చెందారు. వెంటనే ఇళ్ల నుంచి పాలను తీసుకువచ్చి శివలింగం(Shiv Lingam)పై పోసి మొక్కారు. కాసేపయ్యాక జనాన్ని చూసి జడుసుకున్న ఆ కొండచిలువ ఓ చెట్టు తొర్రలో దూరింది. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం సభ్యులు హుటాహుటిన అక్కడికి చేరుకుని తొర్రలో దూరిన కొండచిలువను పట్టుకుని అటవీ ప్రాంతానికి తీసుకెళ్ళి విడచిపెట్టారు.

Updated Date - 2023-07-05T10:49:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising