ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండురోజుల్లో పెళ్ళనగా వరుడి మేనమామ వింత డిమాండ్.. కుప్పకూలిన వధువు తండ్రి.. అసలేమయ్యిందంటే..

ABN, First Publish Date - 2023-02-06T13:02:13+05:30

'ఇదీ.. పెళ్ళివారి డిమాండ్.. అంటూ పెళ్ళికొడుకు మేనమామ చేసిన డిమాండ్ పెళ్ళికూతురు కుటుంబాన్ని బాధలోకి నెట్టేసింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రెండురోజులలో జరగబోతున్న కూతురు పెళ్ళికి ఘనంగా ఏర్పాట్లు చేయిస్తున్నాడు ఆ తండ్రి. అప్పుడే అక్కడికి పెళ్ళికొడుకు మేనమామ వచ్చాడు. 'ఇదీ.. పెళ్ళివారి డిమాండ్.. మీరు ఒప్పుకుంటే సరే.. లేకపోతే ఈ పెళ్ళి జరగదు' అంటూ చాలా కటువుగా చెప్పాడు. ఆ మాటలు విని ఉన్నచోటునే నిలువునా కుప్పకూలిపోయాడు ఆ తండ్రి, తను విన్నది నిజమేనా కాదా అనే అయోమయంలోకి వెళ్ళిపోయాడు. చివరికి పెళ్ళి ఆగిపోయేలా చేసిన ఆ డిమాండ్ ఏమిటి? అసలు ఏమి జరిగింది వంటి విషయాలు తెలుసుకుంటే..

మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్ లో అశోక్ కుమార్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఇతనికి 22 సంవత్సరాల సంధ్య అనే కూతురు ఉంది. ఆ అమ్మాయికి పెళ్ళి సంబంధాలు వెతగ్గా మునేంద్ర అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ తో సంబంధం కుదిరింది. 2022 అక్టోబర్ లో సంధ్య, మునేంద్రల ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ సమయంలో వారు ఎలాంటి కట్నం డిమాండ్ చెయ్యలేదు. 2023 ఫిబ్రవరి 6వ తేదీన పెళ్ళి ఫిక్స్ చేసారు. అయితే ఫిబ్రవరి 4వ తేదీ మునేంద్ర మేనమామ అశోక్ కుమార్ ఇంటికి వెళ్ళాడు. 'పెళ్ళిఖర్చుల కోసం మాకు 21లక్షలు ఇవ్వండి, ఒకవేళ డబ్బు ఇవ్వకపోతే మీకు మాకు ఎలాంటి సంబంధం ఉండదు, పెళ్ళికొడుకు పెళ్ళిమంటపానికి రాడు' అని చెప్పాడు. తను విన్నది నిజమా కలా అనే విషయం అశోక్ కు అర్థం కాలేదు. ఉన్నచోటునే కుప్పకూలిపోయాడు.

కూతురికి వచ్చిన సంబంధం చాలా మంచిదని, పెళ్ళికొడుకు వైపు నుండి ఎలాంటి కట్నం అడగలేదని అశోక్ ఎంతో సంతోషపడ్డాడు. పెళ్ళికొడుకు స్థాయికి తగ్గట్టు 5 నుండి 6 లక్షలు ఖర్చుపెట్టి ఏర్పాట్లు ఘనంగా చేయించాడు. కానీ తీరా రెండురోజుల ముందు ఇలా జరగడంతో అతను పెళ్ళికొడుకు వైపు అందరినీ సంప్రదించి ఈ నిర్ణయం మార్చుకోవాలని రిక్వెస్ట్ చేసాడు. అతడు ఎంత చేసినా వారు నిర్ణయం మార్చుకోకపోవడంతో పెళ్ళికూతురి కుటుంబం చెప్పలేనంత బాధలోకి వెళ్ళిపోయింది. పెళ్ళికొడుకు కుటుంబానికి బుద్దిచెప్పాలని నిర్ణయించుకుని పోలీసులను ఆశ్రయించి పెళ్ళికొడుకు కుటుంబం మీద కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పెళ్ళికొడుకు కుటుంబం కనిపించడం లేదని, వాళ్ళకోసం వెతుకుతున్నామని పోలీసులు తెలిపారు.

Updated Date - 2023-02-06T13:31:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising