Big Alert to Bachelors: బ్యాచులర్స్‌కు గుండె దడ తెప్పించే వార్త.. పెళ్లి చేసుకుంటే అన్నీ కష్టాలే అనుకునే వాళ్ల కోసమే..!
ABN, First Publish Date - 2023-03-22T14:29:27+05:30
పెళ్లి చేసుకుంటే బోలెడు కష్టాలు ఎదురవుతాయి.. సోలో లైఫే సో బెటర్ అని చాలా మంది అంటుంటారు. అలాంటి వారు తమ ఆలోచనలను మార్చుకోవాల్సిందే.
పెళ్లి (Marriage) చేసుకుంటే బోలెడు కష్టాలు ఎదురవుతాయి.. సోలో (Solo) లైఫే సో బెటర్ అని చాలా మంది అంటుంటారు. అయితే అదంతా నిజం కాదని తాజాగా ఓ నివేదిక బయటకు వచ్చింది. ప్రస్తుతం యువతీ యువకులు పెళ్లి చేసుకోవడం మీద పెద్దగా దృష్టి పెట్టడం లేదు. కెరీర్ మీద ఫోకస్ పెట్టి పెళ్లిని వెనక్కి నెట్టేస్తున్నారు. సింగిల్‌గా (Single) ఉంటే చాలా ఉపయోగాలు ఉన్నాయంటున్నారు. అయితే తాజాగా చేసిన ఓ షాకింగ్ సర్వే బ్యాచిలర్స్‌కు (Big Alert to Bachelors) షాకింగ్ విషయం చెప్పింది.
సింగిల్‌గా ఉన్న వారితో పోల్చుకుంటే పెళ్లి చేసుకున్న వ్యక్తుల (Married) శారీరక, మానసిక ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉందని తేలిందట. ఒంటరిగా ఉన్న లేదా విడాకులు తీసుకున్న వారి కంటే వివాహితుల జీవితం కాలం ఎక్కువని బయటపడింది. వివాహం మహిళల, పురుషుల్లో మరణాల రేటును మూడవ వంతు తగ్గించడంలో సహాయపడుతుందని, సాంస్కృతిక దృక్పథం ఆరోగ్యాన్ని గణనీయంగా మెరుగు పరుస్తుందని తేలింది. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌లుగా పని చేస్తున్న ఇద్దరు అధ్యయనకారులు చేపట్టిన స్టడీ వాల్‌స్ట్రీట్ జర్నల్‌లో ప్రచురితమైంది.
Mother Last Wish: నిజమైన కొడుకంటే మీరే బ్రదర్.. తల్లి ఆఖరి కోరికను తీర్చేందుకు స్ట్రెచర్‌పైనే వెయ్యి కిలోమీటర్లు తీసుకెళ్లి మరీ..
ఈ సర్వే కోసం 11, 800 మందిపై అధ్యయనం నిర్వహించారు. దాదాపు 25 ఏళ్ల పాటు వీరిని పరిశీలించి వారి ఆరోగ్యాలను పరిశీలించారు. ఒంటరిగా ఉన్న వారితో పోల్చుకుంటే వివాహితులు 35 శాతం ఆరోగ్యంగా ఉన్నారు. ఒంటరిగా ఉన్నవారు శారీరకంగానూ, మానసికంగానూ అనారోగ్యాల బారిన పడ్డారు. వివాహితులకు గుండె జబ్బులు (Heart Diseases), డిప్రెషన్, ఒంటరితనం వల్ల వచ్చే వ్యాధుల ప్రమాదం తక్కువగా ఉందని, వారు మరింత ఆశాజనకంగా ఉంటున్నారని గమనించారు. వైవాహిక జీవితంలో ఉన్నవారు లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి కోసం శ్రమిస్తున్నట్టు పరిశీలించారు. అలాగే కుటుంబ జీవితం గడుపుతున్న వారు ప్రమాదకర వ్యసనాలకు దూరంగా ఉంటున్నట్టు కూడా అధ్యయనంలో తేలింది.
Bride: పెళ్లిమండపంలోనే వరుడి ఫ్రెండ్ చేసిన తింగరి పని.. దెబ్బకు పెళ్లినే రద్దు చేసుకున్న వధువు.. అసలేం జరిగిందంటే..
Updated Date - 2023-03-22T14:29:27+05:30 IST