ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Weird Facts: నమ్మలేని నిజమిది.. ఈ ఒక్క కారణం వల్లే 5 ఏళ్లు తగ్గిపోతున్న భారతీయుల ఆయుర్థాయం..!

ABN, First Publish Date - 2023-09-04T15:03:13+05:30

చాలా ఏళ్లుగా అత్యధిక జనాభాతో అరకొర సౌకర్యాలతో సాగుతున్న దేశం భారతదేశం. ప్రస్తుతం దేశ జనాభాలో యువత శాతం అధికంగా ఉండడం బాగా కలిసొచ్చే అంశం. ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్న భారతీయులను వాయు కాలుష్యం దారుణంగా దెబ్బ తీస్తోంది. ప్రపంచంలో అత్యధిక వాయు కాలుష్యం ఉన్న ఆరు దేశాలలో భారత్ కూడా ఒకటి.

చాలా ఏళ్లుగా అత్యధిక జనాభాతో అరకొర సౌకర్యాలతో సాగుతున్న దేశం భారతదేశం (India). ప్రస్తుతం దేశ జనాభాలో యువత శాతం అధికంగా ఉండడం బాగా కలిసొచ్చే అంశం. ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్న భారతీయులను వాయు కాలుష్యం (Air Pollution) దారుణంగా దెబ్బ తీస్తోంది. ప్రపంచంలో అత్యధిక వాయు కాలుష్యం ఉన్న ఆరు దేశాలలో భారత్ కూడా ఒకటి. బంగ్లాదేశ్, భారత్, పాకిస్థాన్, చైనా, నైజీరియా, ఇండోనేషియా వంటి దేశాలకు వాయు కాలుష్యం భారీ ముప్పుగా పరిణమించబోతోందని అమెరికాలోని షికాగో యూనివర్సిటీ (University of Chicago) ప్రొఫెసర్ మైకేల్ గ్రీన్‌స్టోన్ వ్యాఖ్యానించారు.

చికాగో యూనివర్సిటీకి చెందిన ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్ (ఎపిక్) తన వార్షిక ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ (AQLI) నివేదికను వెల్లడించింది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా దేశ రాజధాని ఢిల్లీ (Delhi) మొదటి స్థానంలో ఉన్నట్టు ఈ అధ్యయనం పేర్కొంది. ప్రస్తుత కాలుష్య స్థాయి ఇదే రీతిలో కొనసాగితే ఢిల్లీ ప్రజలు 11.9 ఏళ్ల జీవిత కాలాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్దేశించిన ప్రమాణాల కంటే భారత్‌లో వాయు కాలుష్యం చాలా ఎక్కువగా ఉందని తేల్చి చెప్పింది.

ముఖ్యంగా అతిసూక్ష్మ ధూళి కణాల కాలుష్యం భారత్‌లో ఎక్కువగా ఉందని, వీటి వల్ల చాలా మంది ప్రజలు గుండె జబ్బుల బారిన పడుతున్నారని పేర్కొంది. ఈ కాలుష్యం వల్ల భారతీయుల సగటు ఆయుర్దాయం 5 సంవత్సరాలు తగ్గిపోతోందని తెలిపింది. భారత్‌లోని 67.4 శాతం మంది ప్రజలు అధిక కాలుష్య స్థాయిలున్న ప్రాంతాల్లోనే జీవిస్తున్నారని నివేదిక వెల్లడించింది. వాయు కాలుష్యాన్ని ప్రభుత్వాలు చాలా సీరియస్‌గా తీసుకుని గాలి నాణ్యతను మెరుగు పరిచే దిశగా చర్యలు తీసుకోవాలని, లేకపోతే చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ నివేదిక హెచ్చరించింది.

Updated Date - 2023-09-04T15:03:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising