ప్లాస్టిక్ లేదా వెదురు... ఏ టూత్‌బ్రష్ వినియోగానికి ఉత్తమం?... బ్రిజిల్స్ కోసం ఏ మెటీరియల్ వినియోగిస్తారంటే..
ABN, First Publish Date - 2023-04-04T12:03:51+05:30
మనం దంతాలను శుభ్రం చేసుకునేందుకు బ్రెష్ వాడుతుంటాం. అయితే ప్లాస్టిక్ బ్రెష్ వాడటం మంచిదా? వెదురు బ్రెష్ వాడటం మంచిదా అనే విషయంపై మనలో చాలామందికి అనేక సందేహాలు తలెత్తుతుంటాయి.
మనం దంతాలను శుభ్రం చేసుకునేందుకు బ్రెష్ వాడుతుంటాం. అయితే ప్లాస్టిక్ బ్రెష్ వాడటం మంచిదా? వెదురు బ్రెష్ వాడటం మంచిదా అనే విషయంపై మనలో చాలామందికి అనేక సందేహాలు తలెత్తుతుంటాయి. దానికి ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం. ఒక పరిశోధన ప్రకారం ప్రపంచంలో ప్రతి సంవత్సరం 448 మిలియన్ టన్నులకు పైగా ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతోంది. దీని కారణంగా పర్యావరణం చాలా నష్టపోతోంది. వాస్తవానికి ప్లాస్టిక్ వేల సంవత్సరాల వరకు నాశనం కాదు. అటువంటి పరిస్థితిలో దానిని రీసైక్లింగ్ చేయడం ద్వారా మాత్రమే మళ్లీ ఉపయోగించుకోవచ్చు.
వెదురు టూత్ బ్రష్ అనేది కొత్తగా వచ్చిందని చాలామంది అనుకుంటారు. ఇది నిజానికి పాత కాలానికి చెందినదే. వెదురు లేదా ప్లాస్టిక్ టూత్ బ్రెష్‌లలో హ్యాండిల్ మాత్రమే వాటితో తయారై ఉంటుంది. ఈ టూత్‌బ్రష్‌లలో నైలాన్ లేదా ఇతర సహజ ఫైబర్‌లను బ్రిజిల్స్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు, దీనికిముందు బ్రిజిల్స్ కోసం పంది వెంట్రుకలను ఉపయోగించేవారు. కొన్ని టూత్ బ్రష్‌ల బ్రిజిల్స్‌కు బొగ్గు కూడా జోడిస్తారు. తద్వారా దంతాలు మెరుగైన రీతిలో శుభ్రం అవుతాయి. సరైన బ్రష్ వినియోగం విషయంలో దంతవైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.
Updated Date - 2023-04-04T12:04:15+05:30 IST