ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: పెళ్లికి సరిగ్గా వారం ఉందనంగా వధువుకు ఊహించని షాకిచ్చిన బంధువులు! అసలేం జరిగిందో తెలిస్తే..

ABN, Publish Date - Dec 18 , 2023 | 06:03 PM

తన పెళ్లికి రాలేమంటూ చివరి నిమిషంలో చెప్పిన బంధువుల నుంచి కొంత మొత్తాన్ని పరిహారంగా తీసుకుందామని ఓ ఆస్ట్రేలియా యువతి నిర్ణయించింది. ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ఇంటర్న్‌ట్ డెస్క్: బంధువులు, స్నేహితులు, ఆత్మీయుల సమక్షంలో వధూవరులు వివాహం బంధంలో ఒక్కటవుతారు. ఓ మహిళ కూడా ఇలాగే ఆశించింది. బంధువుల ప్రేమాభిమానాలు, శుభాకాంక్షలతో కొత్త జీవితం ప్రారంభించాలనుకుంది. ఇందుకు తగ్గట్టుగా కొన్ని నెలల ముందే వారందిరికీ ఆహ్వానాలు పంపించింది. కానీ, పెళ్లికి సరిగ్గా వారం ఉందనంగా వారు చేసిన పనికి ఆమె తట్టుకోలేకపోయింది. వారి నుంచి పరిహారం కోరేందుకూ రెడీ అయ్యింది. అయితే, తన నిర్ణయంపై తనకే సందేహాలు ఉండటంతో తన మనసులో మాటను ప్రజలతో పంచుకుంది. ఆమె చెప్పిన విషయాలు ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాకు చెందిన ఓ యువతికి (Australia woman) పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. వివాహ వేదిక, డిన్నర్ వంటి ఏర్పాట్లన్నీ ఆమె తనకు కాబోయే భర్తతో కలిసి ప్లాన్ చేసింది. తన వివాహం గురించి స్నేహితులు, బంధువులందరికీ ఏడాదికి ముందే చెప్పి పెట్టింది. పెళ్లికి ఆరు నెలల ముందు వారందరికీ ఆహ్వానాలు పంపింది. చాలా మంది తాము పెళ్లికి వస్తామని రిప్లై ఇచ్చారు. పెళ్లికి ఎంత మంది రాబోతున్నారో నిర్ధారణ అయ్యాక ఆమె వివాహ వేదిక, భోజనం ఏర్పాట్లకు సంబంధించి డబ్బు కట్టేసింది.


అయితే, పెళ్లికి సరిగ్గా వారం ఉందనంగా కొందరు పెళ్లికి రావట్లేదని వధువుకు సమాచారం ఇచ్చారు. వారందరూ వస్తారనుకుని తగినంత డబ్బు ఖర్చు పెట్టి ఏర్పాట్లు చేసి ఉండటంతో ఆమె దిమ్మెరపోయింది (Guests skip wedding a week before the event). ఏడాదికి ముందుగానే పెళ్లి విషయం చెప్పి, ఆరు నెలల ముందుగా ఆహ్వానం పంపితే, ప్రయాణ ఖర్చులు భరించలేమంటూ వారు చివరి నిమిషయంలో చెప్పడం ఆమెకు తప్పుగా తోచింది. వారి తీరుతో ఆమెకు ఆర్థికంగా నష్టం వస్తుండటంతో ఈ భారమంతా పెళ్లికి రానివారికి బదిలీ చేయాలని నిర్ణయించుకుంది. పెళ్లికి వస్తామని చెప్పి ఎగ్గొట్టిన వారి నుంచి ఫీజు రూపంలో (No Show fee) కొంత మొత్తం తీసుకోవాలని నిర్ణయించింది.

ఈ నిర్ణయాన్ని అమలు చేసే ముందు ఆమె జరిగిన ఉదంతం గురించి ఓ పాడ్‌కాస్ట్‌లో పంచుకుంది. దీనికి శ్రోతల నుంచి భారీగా స్పందన వచ్చింది. శ్రోతల్లో సగం మంది యువతికి మద్దతు పలకగా మిగతా వారు ఆమె నిర్ణయాన్ని తప్పు పట్టారు. ఇలాంటి అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు అతిథులను ఇబ్బంది పెట్టకూడదని, అదనపు ఖర్చులను వధూవరులే భరించాలని తేల్చారు. దీంతో, ప్రస్తుతం ఈ ఉదంతం నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది.

Updated Date - Dec 18 , 2023 | 06:03 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising