ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Anilkumble: మీ విధానానికి సెల్యూట్‌ కుంబ్లే సాబ్...

ABN, First Publish Date - 2023-09-12T11:23:04+05:30

భారత జట్టు లెజెండరీ క్రికెటర్‌, అంతర్జాతీయ స్థాయిలో స్పిన్నర్‌గా రికార్డులు తిరగరాసిన అనిల్‌కుంబ్లే(Anilkumble) బీఎంటీసీ

- బీఎంటీసీ బస్సులో ప్రయాణించిన క్రికెటర్‌ అనిల్‌కుంబ్లే

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): భారత జట్టు లెజెండరీ క్రికెటర్‌, అంతర్జాతీయ స్థాయిలో స్పిన్నర్‌గా రికార్డులు తిరగరాసిన అనిల్‌కుంబ్లే(Anilkumble) బీఎంటీసీ బస్సులో ప్రయాణించారు. ఇదే విషయాన్ని ఆయన ట్విట్టర్‌లో రాసుకున్నారు. అందుకు సంబంధించిన పోస్టును షేర్‌ చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న శక్తి గ్యారెంటీ ద్వారా నష్టపోతున్నామని ఆటోలు, క్యాబ్‌ సర్వీసుల ఓనర్లు, డ్రైవర్లు సోమవారం బెంగళూరు బంద్‌ చేపట్టారు. అనిల్‌కుంబ్లే బెంగళూరు ఎయిర్‌పోర్టుకు ఉదయం చేరుకున్నారు. ప్రైవేట్‌ ట్యాక్సీలు లేకపోవడంతో ఇంటి నుంచి ప్రత్యేకంగా కారు తెప్పించుకోవడం ఎందుకని భావించిన ఆయన ఎయిర్‌పోర్టు నుంచి నగరానికి వచ్చే బీఎంటీసీ ఓల్వో బస్సులో ప్రయాణించారు. అనిల్‌కుంబ్లే ట్వీట్‌కు నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేశారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మీ విధానానికి సెల్యూట్‌ అనే కామెంట్లు ఎక్కువగా ఉన్నాయి.

Updated Date - 2023-09-13T22:51:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising