Air India water leak: విమానంలో నీళ్లు లీకవడంపై ఎయిర్ ఇండియా స్పందన!
ABN, First Publish Date - 2023-11-30T21:52:01+05:30
విమానంలో లగేజీ పెట్టుకునే ఓవర్ హెడ్ బిన్స్ నుంచి సీట్లపై నీళ్లు పడిన ఘటనపై ఎయిర్ ఇండియా స్పందించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఎయిర్ ఇండియా(Air India) విమానంలో సీట్లకు పైన ఉన్న లగేజీ బిన్స్ నుంచి నీళ్లు కారుతున్న వీడియో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే(Water dripping from overhead bins). నీళ్లు కారడానికి కారణం ఏంటో, అసలు ఈ ఘటన ఏ ఫ్లైట్‌లో జరిగిందో తెలీక జనాలు తమకు తోచిన అభిప్రాయాలను నెట్టింట పంచుకున్నారు. ఏసీలో సమస్య నీళ్ల లీకవడానికి దారి తీసిందని కొందరు పేర్కొన్నారు. బిన్స్‌లో పేరుకుపోయిన మంచు అకస్మాత్తుగా కరగడంతో నీళ్లు లీకయ్యాయని మరికొందరు చెప్పారు. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియాలో సేవాలోపంపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి.
నెట్టింట ఈ వీడియో చర్చనీయాంశం కావడంతో ఎయిర్ ఇండియా స్పందించింది(Air India statement). నవంబర్ 24న గాట్విక్ నుంచి అమృత్సర్‌కు వస్తున్న విమానంలో ఈ ఘటన జరిగినట్టు వెల్లడించింది. ‘‘కాబిన్‌లో అరుదుగా మాత్రమే జరిగే కండన్సేషన్ మార్పుల కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది. ప్రభావిత సీట్లలోని ప్యాసింజర్లకు ఇతర సీట్లు కేటాయించాము. ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా విమానంలోని సిబ్బంది అన్ని చర్యలు తీసుకున్నారు’’ అని ఎయిర్ ఇండియా పేర్కొంది. ఘటనపై విచారం వ్యక్తి చేసిన సంస్థ..తాము ప్రయాణికులకు భద్రత, సౌకర్యాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది.
Updated Date - 2023-11-30T21:56:52+05:30 IST